మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఆ సినిమాకు వస్తున్న అవార్డులను చూస్తే తెలిసిపోతుంది. నేషనల్ అవార్డ్ ను దక్కించుకోవడంతో పాటు లోకల్ గా ఎన్నో పురస్కారాలు కూడా ఈ చిత్రం అందుకుంది. సైమా అవార్డులలో కూడా ఈ చిత్రం తన ప్రాముఖ్యతను చాటుకుంటుంది. మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరపైకి వచ్చి ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో నటించగా ఈ సినిమాకు ఆయనే కీలక పాత్రధారి. సెల్ఫిష్ గా ఉంది మహేష్ బాబు ను మార్చి ప్రజల కోసం సహాయ పడేలా చేసిన ఈ పాత్రను అల్లరి నరేష్హీరో చేయనంత గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా హిట్ కు ఆమె గ్లామర్ ఎంతగానో తోడ్పడింది. తొలి భాగం లో వీరు ముగ్గురు కలిసి కాలేజీలో చేసే సందడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ వయసులో మహేష్ బాబు కాలేజ్ కుర్రాడి లా చేయడమేంటి అని అనుకున్నా కూడా ఆ ఎపిసోడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

పేదరికంలో పుట్టి ధనికుడి గా ఎదగాలనే ఆశతో తన చుట్టూ ఉన్న ప్రతి దాన్ని సెల్ఫీష్ గా ఆలోచిస్తూ స్వార్ధం తో ముందుకు పోతూ ఉంటాడు హీరో. అలాంటి టైంలో ఎలాంటి కల్మషం లేని వ్యక్తి తన జీవితం లోకి ఎంటర్ అవుతాడు. ఒకానొక సందర్భంలో హీరో  కెరీర్ను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ దాని నుంచి హీరో ఎలాగోలా బయట పడతాడు. ఈ సమయంలోనే ఒకానొక సందర్భంలో తన స్నేహితుడు గుర్తొచ్చి అతని దగ్గరికి వెళ్లగా అతను ఓ సమస్యలో ఉంటాడు అని తెలుస్తుంది. ఆ సమస్య నుంచి స్నేహితుడి నీ ఎలా కాపాడాడు. తన కెరీర్ పోకుండా ఉండడానికి కారణం ఈ స్నేహితుడు అని తెలుసుకుని ఈ హీరో ఏ విధంగా ఇతరులకు తన చదువును ఉపయోగించాడు అనేదే ఈ సినిమా కథ. 

మరింత సమాచారం తెలుసుకోండి: