మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ సినిమా చేసిన తర్వాత సైరా లాంటి భారీ హిట్ పడకపోయి ఇప్పుడు ఆయన పరిస్థితి వేరేలా ఉండేది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం చిరంజీవిని సరికొత్త కోణంలో చూపించడమే కాకుండా ఆయనకు మరిచిపోలేని సూపర్ హిట్ ను అందించింది. పరుచూరి బ్రదర్స్ రచన అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వం ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం అయ్యింది. ఈ సినిమా వంద కోట్లకు పైగా కలెక్ట్ చేసింది అంటే ఈ చిత్రం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

చిరంజీవి స్టామినా తగ్గిపోలేదని ఈ సినిమా మరొకసారి నిరూపించింది. 100 కోట్ల కలెక్షన్లు అందుకోవడమే కాకుండా చిరంజీవి మళ్లీ ఇలాంటి సినిమా చేయలేనంతగా సూపర్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. భారతదేశ తొలి స్వతంత్ర సమరయోధుడు గాధ గా ఈ చిత్రం తెరకెక్కగా ఆయన తెలుగువాడు కావడం తెలుగువారికి గర్వకారణం. ఖైదీ నెంబర్ 150 సినిమా తెలుగు ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుని ఆ తర్వాత క్లాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే విధంగా ఆయన ఈ సినిమా చేశారు.

అయితే ఈ సినిమాను తెరకెక్కించే విధానంలో మంచి తేడా పరిణతిని కనబరిచిన సురేందర్ రెడ్డి ఈ చిత్రంతో భారీ హిట్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాలలో ఒక సినిమా గా ఉండేలా చేశాడు. హీరోయిన్ గా నయనతార నటించగా మరో కీలక పాత్రలో తమన్నా నటించగా ఈ సినిమా సూపర్ హిట్ కావడం లో వీరిద్దరూ ప్రత్యేక పాత్రను పోషించారు. జగపతిబాబు కన్నడ హీరో సుదీప్ లాంటి పెద్ద పెద్ద నటులు కూడా ఈ చిత్రంలో నటించారు. ఇక బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమా లో నటించడం విశేషం. అదే దేశవ్యాప్తంగా అందరికీ ఈ సినిమా దగ్గరవడానికి ముఖ్య కారణం. 

మరింత సమాచారం తెలుసుకోండి: