గత కొన్ని సినిమాలు ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు చూస్తుంటే ఎన్టీఆర్ ఏ రేంజ్ లో పరిణతి చెందాడు అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో సినిమా దర్శకుడిగా ఎంపిక విషయంలో ఎంతో జాగ్రత్త వహిస్తాడు అందుకే ఆయనకు సినిమాలు హిట్లు అవుతున్నాయి. వీటిలో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన సినిమా జనతా గ్యారేజ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగునాట సంచలనం సృష్టించే రీతిలో సూపర్ హిట్ గా నిలిచింది. ఎన్టీఆర్ కు కు మరొక భారీ హిట్ ను అందించడమే కాకుండా ఆయన కెరీర్లో మర్చిపోలేని సినిమాను అందించాడు కొరటాల శివ.

రచయితగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన కొరటాల శివ దర్శకుడిగా మిర్చి సినిమాతో ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను చేశాడు. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమా చేసిన తర్వాత ఎన్టీఆర్ తో కలిసి జనతా గ్యారేజ్ సినిమా చేయగా ఆ సినిమా భారీ గా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ ను అందించింది. ప్రకృతిని ప్రేమించే హీరో ప్రకృతి కి ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకోలేడు. అలాంటి సమయంలోనే ఆయన హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ప్రజలు పడే ఇబ్బంది ని గమనించి అనే ఓ గ్యాంగ్ లో చేరి అక్కడ ప్రజల సమస్యలను తీరుస్తుంటాడు.

అంతకుముందు జనతాగ్యారేజ్ కు గ్యాంగ్ లీడర్ లేకపోవటం వల్ల సరైన లీడర్ కోసం చూస్తూ ఉంటారు. వృద్ధాప్యం మీద పడడంతో పాత గ్యాంగ్ లీడర్ సమస్యలను తీర్చలేక పోతాడు. అప్పుడు అందరూ ఎదురు చూస్తున్న సమయంలో వీరికి హీరో తోడవుతాడు. అలా వీరు అందరూ కలిసి తమ వద్దకు వచ్చే ప్రజల సమస్యలను పరిష్కరించి ఎలా సంతోషంగా ఉంచారు అనేది అసలు కథ. అంతేకాదు ఈ జనతా గ్యారేజ్ కు హీరోకు ఉండే అనుబంధం కూడా ఈ చిత్రంలో అందరినీ ఎంతగానో గురిచేస్తుంది. నిత్య మీనన్ కథానాయికగా నటించగా ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఎన్టీఆర్ గత సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది.100 కోట్లకు పైగా ఈ చిత్రం కలెక్షన్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: