సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య ఈగోలు ఉంటాయి వారిలో ఒకరికి ఒకరికి పడదు.. అందుకే వారు ఎక్కువగా బయట కలిసి ఉండరు.. సినిమా ఫంక్షన్లకు కూడా ఒకరి కోసం ఒకరు పాటుపడరు.. అనే భావన ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా హీరోలు తమ సినిమాల కు పోటీగా వచ్చే హీరోల కోసం పనిచేస్తూ వారి సినిమా ఫంక్షన్లకు గెస్ట్ లు గా వస్తూ తమ మధ్య ఇగోలు లేవని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర హీరోల సినిమాల ఈవెంట్లకు వెళుతూ తనకు ఎలాంటి ఈగో లేదు అని చెప్పకనే చెబుతున్నాడు.

తాజాగా ఆయన ఎన్టీఆర్ సినిమా కోసం రాబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు తొందరలోనే మొదలుపెట్టి సినిమా మొదలు పెట్టాలనేది ఎన్టీఆర్ ఆలోచన. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా లాంచింగ్ కార్యక్రమానికి మహేష్ బాబు రాబోతున్నాడు. 

ఈ చిత్ర దర్శకుడు కొరటాల శివ మహేష్ బాబు తో రెండు సినిమాలు చేసిన అనుభవం ఉండటం అనుబంధం బాగా ఉండటంతో మహేష్ బాబు కూడా ఈ చిత్రానికి ఓపెనింగ్ కి రావడానికి ఒప్పుకోవడం విశేషం. ఏదేమైనా మహేష్ తన తోటి హీరోల పట్ల తనకు ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేవని చెబుతున్నాడు. గతంలో కూడా పెద్ద హీరోల సినిమా ఫంక్షన్లకు వెళ్లి ఆల్ ది బెస్ట్ చెప్పిన విషయం తెలిసిందే. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో పాల్గొంటుండగా త్వరలోనే రాజమౌళి త్రివిక్రమ్ సినిమాలు కూడా చేయనున్నాడు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి: