అక్కినేని నాగ చైతన్య తన భార్య సమంత కు విడాకులు ఇవ్వబోతున్నాడు అనే వార్త ఇప్పుడు తెలుగునాట సంచలనం అవుతుంది. అయితే అభిప్రాయ భేదాల కారణంగా నే ఈ విడాకుల ఇస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఆ డిప్రెషన్ వల్ల నాగచైతన్య ఏమైపోతాడో అన్న భయం కుటుంబంలో ఏర్పడగా ఇప్పుడు ఆయన వరుస సినిమాలు చేయడం వల్ల ఆ డిప్రెషన్ కొంత తగ్గిస్తుందని ఆయన సన్నిహితులు నమ్ముతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా చేసిన లవ్ స్టోరీ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకోగా ఇది తప్పకుండా విజయం సాధిస్తుందని ఇది నాగచైతన్యకు రిలీఫ్ గా ఉంటుందని చెబుతున్నారు.

దాని తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అనే చిత్రం చేయబోతున్నాడు చైతు. ఇటీవలే బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో కలిసి లాల్ సింగ్ చడ్డా అనే చిత్రంలో నటించాడు. అంతేకాకుండా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా ఓకే చెప్పి త్వరలోనే షూటింగ్ కు వెళ్లి పోతున్నాడు.  అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ ఓ టీ టీ సంస్థ నిర్మించే ఈ వెబ్ సిరీస్ చైతు కు తగ్గట్టుగా భారీగానే తెరకెక్కుతుందని అంటూన్నారు.

ఏదేమైనా నాగచైతన్య ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడని చెప్పాలి. అక్కినేని నటవారసుడు గా వచ్చిన నాగచైతన్య ఇప్పటివరకు మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆయన ఇంకా ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఇక సమంత విషయానికి వస్తే నవంబర్ నుంచి తాను కొత్త జీవితాన్ని మొదలు పెట్టనున్నట్లు ఆమె ఇప్పటికే వెల్లడించగా తిరుపతిలో కూడా ఆమె ఓ విలేఖరి పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనాత్మకం అవుతున్నాయి. ఏదేమైనా అక్కినేని అభిమానులు ఈమె నుంచి చైతన్య విడాకులు తీసుకోబోతున్నాడు అనగానే ఎంతో నిరాశకు లోనవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: