యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మాతగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. దీనితో ఎన్టీఆర్ తన తదుపరి సినిమాను లైన్ లో పెట్టే పనిలో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో  సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్స్ట్-యువసుధ ఆర్స్ట్ పై కళ్యాణ్ రామ్- సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది. ? ఎప్పుడు విడుదల అవుతుంది.? అనే  విషయంలో ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా అక్టోబర్ 30 వ తేదీన ప్రారంభించాలని చిత్రబృందం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత నవంబర్ రెండో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ప్రారంభించాలని మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నీ హీరోయిన్ గా తీసుకోవాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆలియా భట్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్ కు జంటగా నటిస్తోంది. కొరటాల శివ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు ఏదైనా ఒక సందేశాత్మక అంశాన్ని జోడిస్తూ కథను చెప్పడం ఈ దర్శకుడి ప్రత్యేకత. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ  తెరకెక్కించే సినిమాలో కూడా ఇలాంటి కథని సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ సినిమాలో ఎన్టీఆర్ సాధారణ విద్యార్ధి నుంచి ఓ కార్పోరేట్ కంపెనీ సీఈవోగా ఎదిగిన వైనాన్ని స్ఫూర్తిదాయకంగా మలుస్తున్నట్లు సమాచారం. ఈ జోనర్ లో ఇప్పటికే మహేష్ బాబు హీరోగా నటించిన 'మహర్షి' సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. మరి దాదాపు ఇలాంటి కథతోనే ఎన్టీఆర్ కూడా బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: