విజ‌య్ సేతుప‌తి ఇప్పుడు తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని హిరో. త‌మిళంలో మంచి సినిమాలో హిరో గా పేరు తెచ్చుకున్న విజ‌య్ సేతుప‌తి మెల్ల‌గా తెలుగు లోకి కూడా రంగ ప్ర‌వేశం చేశాడు., 2019 లో వ‌చ్చిన చిరంజీవి సైర న‌ర‌సింహ‌రెడ్డి సినిమాలో మొద‌టి సారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అనంత‌రం చాలా సినిమాలు చేశాడు. కానీ ఈ మ‌ధ్య నే వ‌చ్చిన ఉప్పెన సినిమాలో రాయ‌ణం పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కులకు సుప‌రిచితుడు అయ్యాడు. విజ‌య్ సేతుప‌తి. ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి తెలుగు సినిమాల క‌థ‌ల ను కూడా వింటున్నాడంటే తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌లా ఆద‌రిస్తున్నారో తెలుస్తుంది.అయితే విజ‌య్ సేతుప‌తి అంద‌రి హిరోలా కాదు. క‌థ న‌చ్చితే ఆ పాత్ర నేనా చేస్తాడు. ఇంత వ‌ర‌కు ఏ హిరో చేయ‌లేని విల‌న్  పాత్ర ల‌ను సైతం విజ‌య్ సేతుప‌తి చేస్తున్నాడు. అస‌లు తెలుగు లో విల‌న్ పాత్ర‌ల‌తోనే విజ‌య్ సేతుప‌తి ప‌రిచ‌య మ‌య్యాడు. విజ‌య్ సేతుప‌తి త‌న ద‌గ్గ‌ర కు వ‌చ్చిన ప్ర‌తి డైరెక్ట‌ర్ కు ఓకే చెబుతున్నాడు. వీలైనన్ని ఎక్కువ సినిమా లు చేయ‌డంలో విజ‌య్ బిజీ గా ఉన్నాడు. ప్ర‌స్తుతం విజయ్ సేతుప‌తి నటించిన సినిమాలు వారానికి రెండు చొప్పున వ‌స్తున్నాయి. దీని ద్వార మ‌నం అర్థం చేసుకోవాలి విజయ్ సేతుప‌తి ఎన్ని సినిమాల‌లో న‌టిస్తున్నాడో..తాజాగా మ‌రో సినిమా లో న‌టించ‌డానికి విజ‌య్ సేతుప‌తి ఒప్పుకున్నాడు. అగ్ర ద‌ర్శ‌కుల‌లో ఒక‌రైనా మిస్కిన్ ద‌ర్శక‌త్వంలో వ‌స్తున్న పిశాచు-2 లో గెస్ట్ రోల్ న‌టించ‌డానికి విజ‌య్ సేతుప‌తి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట‌. దీనిపై విజ‌య్ సేతుప‌తి స్పంధిస్తు.. పిశాచు క‌థ విన్నాను. చాలా బాగుంది. నాకు కూడా బాగ న‌చ్చింది. ఈ సినిమాలో పాత్ర ల కూర్ప అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో నాకు అవ‌కాశం ఇవ్వాల‌ని డైరెక్ట‌ర్ మిస్కిన్ ను అడిగాను. మిస్కిన్ వెంట‌నే ఒప్పుకున్నారు. మిస్కిన్ వంటి గొప్ప ద‌ర్శ‌కుడి సినిమాలో న‌టించ‌డం సంతోషంగా ఉంది. అని విజ‌య్ సేతుప‌తి అన్నారు. ఈ సినిమాలో విజ‌య్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.మరింత సమాచారం తెలుసుకోండి: