ఇటీవల కాలంలో టాలీవుడ్ లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన అతి తక్కువ చిత్రాల్లో ఇది కూడా ఒకటి. వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టి నిర్మాతలకు డబుల్ ట్రీట్ ఇచ్చిన ది బెస్ట్ మూవీ. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా పరిచయమయిన చిత్రం ఉప్పెన. అలాగే ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. నాన్నకు ప్రేమతో చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన దర్శకుడు బుచ్చి బాబు తొలిసారి ఈ మూవీతో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టుకున్నాడు. కృతి సెట్టి కూడా హీరోయిన్ గా ఇది తొలి పరిచయమే. ఇక కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి అటు తమిళ్, ఇటు తెలుగులోనూ మంచి క్రేజ్ ను తెచ్చుకున్నారు. అయితే నేరుగా తెలుగు చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి కావడం మరో విశేషం. 

ఇక కథ విషయానికొస్తే ఒక సాధారణ  ప్రేమకథా సన్నివేశాన్ని వెండి తెరపై సరికొత్తగా కనబరిచి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు. రెగ్యులర్ లవ్ స్టోరీనే అయినా అందులో కొత్తదనాన్ని చూపించి ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ అందుకున్నాడు. విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకే హైలెట్. వైష్ణవ్, కృతి లకు కి ఇది తొలి సినిమానే అయినా ఎక్కడ ఆ ఫీలింగ్ కొంచమైనా కలగలేదు అంతగా ఇద్దరు ఒకరిని మించి మరొకరు నటించి మైమరిపించారు. చడి చప్పుడు లేకుండా వచ్చిన కృతి ఒక్క సినిమాతో యువత గుండెల్లో సునామీ తెప్పించి వారి ఆరాధ్య దేవతగా మారిపోయింది. వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్ గా మారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది బేబమ్మ. బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను సంతోష సముద్రంలో ముంచింది.

మరో విశేషం ఏంటంటే ఈ సినిమా నిర్మాణ సంస్ధ  మైత్రీమూవీ మేకర్స్‌ తొలి సినిమాతోనే ఇండస్ట్రీకి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ను ఇచ్చిన బుచ్చిబాబు కి బెంజ్ కారుని, ఈ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరడానికి కారణమైన హీరో వైష్ణవ్ తేజ్ కి కోటి రూపాయలు, అదే విధంగా హీరోయిన్ కృతి సెట్టి కి 25 లక్షల భారీ ఎమౌంట్‌ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమా అందించిన సక్సెస్ ఇండస్ట్రీలో మెగా హీరోల స్థాయిని మరో మెట్టు పెంచిదనే చెప్పాలి. ఈ సినిమా కేవలం 22 కొటల్ బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: