పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసిన సినిమా జల్సా. గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించగా పార్వతి మెల్టన్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్ రాజ్, ఆలీ, బ్రహ్మానందం, ఉత్తేజ్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. కాగా ఈ మూవీ రిలీజ్ తరువాత మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక సంజయ్ సాహు పాత్రలో కన్పిస్తారు. ఈ మూవీ కి దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకాభిమానులు నుండి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి.

అయితే ఆ తరువాత కొన్నేళ్ల అనంతరం మరొక్కసారి త్రివిక్రమ్ తో పవర్ స్టార్ చేసిన సినిమా అత్తారింటికి దారేది. సమంత ఇందులో హీరోయిన్ గా నటించగా నదియా, బోమన్ ఇరానీ, ప్రణీత, కోటశ్రీనివాసరావు, ఆలీ, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలు చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఎంతో భారీ వ్యయంతో నిర్మించారు. అయితే అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ విడుదల తరువాత భారీ సక్సెస్ కొట్టడంతో పాటు అప్పట్లో చాలా ఏరియాల్లో అత్యధిక కలెక్షన్ రాబట్టిన మూవీగా గొప్ప రికార్డు సొంతం చేసుకుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్, సమంత అందం ఆకట్టుకునే నటన, దేవిశ్రీ సాంగ్స్, భారీ ఫైట్స్, త్రివిక్రమ్ ఆకట్టుకునే కథ, కథనాలు, పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్, నిర్మాతల భారీ నిర్మాణ విలువలు వెరసి అత్తారింటికి దారేది మూవీని ఎంతో భారీ సక్సెస్ చేసాయి. ఇక ఈ సినిమాలో గౌతమ్ నందగా పవన్ కళ్యాణ్ పలికే డైలాగ్స్, యాక్షన్, ఫైట్స్ ని ఎప్పటికీ కూడా ప్రేక్షకాభిమానులు మరిచిపోలేరు. ఈ సినిమాని మంచి యాక్షన్, ఎంటర్టైన్మెంట్ తో పాటు మనసుని తాకే ఎమోషనల్ అంశాల కలయికగా త్రివిక్రమ్ తీశారు. ఇక ఈ మూవీ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టి మరొక్కసారి పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ని టాలీవుడ్ కి రుచిచూపించడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: