తెలుగు సినీ పరిశ్రమలో హాస్యానికి పెట్టింది పేరట ఎమ్మెస్ నారాయణ.. ఈయన చూడడానికి పొట్టిగా ఉన్నప్పటికీ ఆయన వేసే డైలాగులు చాలా గట్టిగానే పేలుతాయని తెలుస్తుంది..


ఇలాంటి ప్రముఖ హాస్యనటుడిని దర్శకుడు సాగర్ లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాడని సమాచారం.. అయితే ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు సాగర్ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారిందని తెలుస్తోంది.. అయితే ఎమ్మెస్ నారాయణ చేసిన తప్పు ఏమిటి ఎందుకు సాగర్ కొట్టాల్సివచ్చింది అనే విషయం

ఇప్పుడు చూద్దాం.


తెలుగు చలన చిత్ర పరిశ్రమలలో అన్వేషణ మరియు చార్మినార్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి ,మంచి గుర్తింపు తెచ్చుకున్నాడట డైరెక్టర్ సాగర్.. ఇక ఈయన ఎన్నో సినిమాలకు దర్శకుడిగా పనిచేసి, మంచి గుర్తింపు పొందాడని తెలుస్తుంది.. ఇటీవల ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకానొక సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడికి అలాగే కోట శ్రీనివాసరావు కి మధ్య మనస్పర్థలు తలెత్తాయని సమాచారం.. అయితే గొడవలకు గల కారణం ఏమిటి అని అడిగితే అప్పుడు దర్శకుడు సమాధానం చెబుతూ.. ఒకసారి సినిమా షూటింగ్ సమయం లో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉందని చెప్పారట.అప్పుడు భరణి మరియు మహేష్ ఆనంద్ అలాగే కోట శ్రీనివాసరావు గారి పై ఈ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉందని చెప్పారట. ఇచ్చిన తేదీ ప్రకారం వీరు సెట్ లో సిద్ధంగా ఉన్నారని చెప్పారట.


కానీ ఆ రోజు కోట షూటింగ్ కి రాలేనని బాగా దగ్గరి బంధువులు మరణించారని చెప్పడంతో షూటింగ్ వాయిదా వేసుకున్నారని చెప్పినట్లు సమాచారం.అయితే ఎప్పుడు కోటకు వీలవుతుందో, అప్పుడే డేట్ ను కూడా ఫిక్స్ చేయడం జరిగిందని సమాచారం. మరి అదే తేదీన కోట కు ఫోన్ చేసి అడిగితే, నేను రాలేను అని సమాధానం చెప్పాడని సమాచారం.. అయితే నేను ఫోన్ చేసి నాలో ఉన్న మరొక యాంగిల్ ను చూడవద్దు వచ్చి సెటిల్ చేయండి అని చెప్పడంతో, కోట వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొనడం జరిగిందని సమాచారం.


 


ఇక అదే సమయంలో ఎమ్మెస్ నారాయణను కూడా కొట్టాల్సివచ్చిందని చెప్పాడట సాగర్ . ఇందుకు గల కారణం ఏమిటంటే ఒక రోజు ఎమ్మెస్ నారాయణ బాగా తాగేసి , నిర్మాతలను బూతులు తిట్టాడని సమాచారం.దాంతో కోపం వచ్చి లాగి చెంపపై కొట్టానని చెప్పారట.అలా మాట్లాడడం తప్పు అంటూ చేయి చేసుకున్నట్టు ప్రముఖ దర్శకుడు సాగర్ తెలిపినట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: