ఈమధ్య కాలంలో ఫామిలీ అంత థియేటర్స్ కి వెళ్లి బాగా ఎంజాయ్ సినిమా అంటే చాలామంది ఎఫ్ 2 అనే చెప్తారు. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి పండించిన కామెడీ అంత ఇంత కాదు. వెంకటేష్ గారిలో ఉండే కామెడీని చాలా రోజుల తర్వాత అనిల్ బాగా వాడుకున్నారు. 2019 సంక్రాంతి కి పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఆ ఏడాదిలోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది. సినిమాలో వెంకటేష్ కి తగ్గట్టుగానే వరుణ్ తేజ్ కూడా చాలా బాగా నటించారు.

ఇక మెహరీన్ , తమన్నా ఇద్దరు తమ అందాలతో సినిమాకి గ్లామర్ తీసుకొచ్చారు. ఇక రాజేంద్రప్రసాద్ గారు రెండు పెళ్లాలతో పడే కష్టాలు స్క్రీన్ మీద మంచి హాస్యాన్ని పండించింది. ఇక ఈ సినిమా  దాదాపుగా 100 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో పాటు 70 కోట్ల షేర్ ని సాధించింది.ఈ సినిమా కి పోటీగా విడుదలైన విధయా వినయ రామ సినిమా సరిగ్గా ఆడకపోవడం కూడా ఈ సినిమా కి బాగా ప్లస్ అయింది. అలాగే ఇండియన్ పారోనామ అవార్డ్స్ కి కూడా ఎఫ్2 సెలెక్ట్ అవ్వడం ఇంకొక విశేషం.

 ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అనిల్ రావిపూడి ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్3 ని తీస్తున్నారు. ఈ సీక్వెల్ లో వెంకీ , వరుణ్ తో పాటు సునీల్ కూడా మనకు కామెడీ పండించబోతున్నాడు. మొదటి భాగం అంత పెళ్లాలతో భాధలని చూపించిన డైరెక్టర్ రెండోవ భాగంలో డబ్బులతో భాధలని చూపిస్తారట. కరోన వలన షూటింగ్ నిలిపేసి ఈ మద్యనే మళ్ళీ మొదలైన ఈ సినిమా షూటింగ్ ని త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది మొదట్లోనే విడుదల చేయాలని మూవీ టీం అనుకుంటున్నారు. ఎఫ్2 హిట్ అవ్వడంతో ఎఫ్3 మీద భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: