మెగాస్టార్ చిరంజీవి ల‌వ్ స్టోరీ సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో మెరిసారు. ఈ సంధ‌ర్బంగా మెగాస్టార్ త‌న స్పీచ్ తో అద‌ర‌గొట్టారు. అయితే చివ‌ర‌గా మాత్ర మెగాస్టార్ ఎమెష‌నల్ అయ్యారు. సినిమా టికెట్ల అంశం గురించి మాట్లాడుతూ మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మెగాస్టార్ మాట్లాడుతూ...కరోనా లాక్ డౌన్ తర‌వాత‌ స్కూల్ కు వెళ్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఇప్పుడు సినిమా ఫంక్షన్స్ కు రావడం అంతే సంతోషంగా ఉందని మెగాస్టార్ అన్నారు. సినిమా కార్యక్రమాల్లో మిత్రులను కలిసి అలాగే ప్రేక్షకుల చప్పట్లు విని చాలా రోజులు అవుతోందని చెప్పారు. ఈ మధ్య త‌న‌ను ఎవరైనా టీజర్, ట్రైలర్ లాంఛ్ చేయమని అడిగితే, ఇంట్లో కూర్చుని లాప్ టాప్ లో చేస్తూ ఉన్నానంటూ మెగాస్టార్ అన్నారు. కానీ బయటకొచ్చి ఆడియన్స్ చప్పట్లు వింటే వచ్చే సంతోషమే వేరని వ్యాఖ్యానించారు. 

నారాయణదాస్ నారంగ్ త‌న‌కు ఎన్నో ఏళ్లుగా మిత్రుల‌ని ఆయన 80వ దశకంలో డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలోకి లోకి వ‌చ్చినప్పటి నుంచి త‌న‌కు సన్నిహిత సంబంధం ఉందని చెప్పారు. ఆయన త‌న‌కు గురువులాంటి వార‌ని భావిస్తా అంటూ మెగాస్టార్ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆయ ఫిల్మ్ ఇండస్ట్రీకి భీష్మాచార్యులు వంటివారన్నారు. అంతే కాకుండా ఏషియన్ ఫిల్మ్స్ నిర్మాణ రంగంలోకి రావడం సంతోషకరమ‌ని... మీలాంటి వాళ్లు ప్రొడక్షన్ లోకి రావాలని...సినిమాలు నిర్మించాలని దాంతో సినిమా విలువ మరింత పెంచాలని మెగాస్టార్ కోరారు. మీకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానమ‌ని మెగాస్టార్ అన్నారు.

నారాయణదాస్ కుమారుడు సునీల్ తండ్రిని మించిన తనయుడని చాలా స్మార్ట్ అని వాళ్ల కృషి లేకుంటే పంపిణీ రంగంలో, ఎగ్జిబిషన్ సెక్టార్ లో ఇన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్, ఇన్ని స్క్రీన్స్ అందుబాటులో ఉండేవి కావంటూ మెగాస్టార్ చెప్పారు. ఇవాళ భారతదేశంలోనే ఎక్కువగా మల్టీప్లెక్స్ థియేటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయంటే కారణం సునీల్ నారంగ్ లాంటి వాళ్ల కృషి వల్లేనని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్ త‌న స్పీచ్ చివ‌రిలో క‌రోనా వ‌ల్ల సినిమా ప‌రిశ్ర‌మ తీవ్రంగా న‌ష్ట‌పోయింద‌ని.. రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాలు ఆదుకోవాల‌ని రిక్వెస్ట్ చేశారు. ముఖ్యంగా ఏపీ సీఎం మమ్మ‌ల్ని క‌రుణించండి ల‌వ్ స్టోరీ వేధిక‌గా కోరుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. కేవ‌లం కొంత‌మంది హీరోల రెమ్యున‌రేష‌న్ చూసి ప‌రిశ్ర‌మ‌లో అంద‌రూ భాగున్నార‌ని అనుకోవ‌ద్ద‌ని మెగాస్టార్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: