బాహుబలి అంటే కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచం అంత గుర్తుపడతారు. ఒక సినిమా సెకండ్ పార్ట్ కోసం ప్రజలు 2  సంవత్సరాలు ఆత్రుతగా వెయిట్ చేశారు అంటే జనాలకి మూవీ ఎంత బాగానచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి-ది బిగినింగ్ రిలీజ్ అయ్యాక ఎక్కడ విన్న, ఎవరి నోట విన్న ఇదే ప్రశ్న: "కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు?"అని. అంతగా క్రేజ్ వచ్చింది మరి ఆ సినిమాకు. 180 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ లో ఏకంగా 650 కోట్ల కలెక్షన్ ను తెచ్చిపెట్టింది.

సినిమా వి  కొన్ని ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ ఏంటో తెలుసుకుందామా?

మన రెబెల్ స్టార్ ప్రభాస్సినిమా కి  ఎంత అంకితం అయ్యారంటే బాహుబలి చిత్రానికి సైన్ చేశాక వేరే ఏ ప్రాజెక్టు  ఒప్పుకోలేదు అన్నిటినీ తిరస్కరించడమే కాకుండా  బిజీ షెడ్యూల్ కారణంగా ఆఖరికి తన పెళ్లిని కూడా పోస్టుపోన్ చేసుకున్నారట.


51 కోట్లు ఖర్చు పెట్టి సోనీ టెలివిజన్ వారు ఈ సినిమా యొక్క హిందీ వెర్షన్ శాటిలైట్ రైట్స్ ను కొనుగోలు చేశారు,అయితే దుబ్బింగ్ ఫిలిం కోసం ఇంత ఖర్చు పెట్టడం ఓ పెద్ద విశేషం.


బాహుబలి సినిమా కి  వి ఎఫ్ ఎక్స్ సర్వీస్ ఇచ్చిన టీం, 2015 లో జురాసిక్ వరల్డ్ సినిమాకి సర్వీసెస్ ఇచ్చిన టీం ఒకటే.


అడ్వాన్స్ బుకింగ్ టైం లో చాలా సైట్స్ క్రాష్ అయ్యాక కూడా 24  గంటల్లో   1 మిలియన్ కి పైగా టికెట్స్ కొనుగోలు జరిగింది.


బాహుబలి 2 తో కంక్లూషన్ ఇచ్చిన బాహుబలి 3  రావొచ్చేమో అని డైరెక్టర్ రాజమౌళి గారు అన్నారు. మరి ఇంతకీ నిజంగా వస్తుందా? ఒక వేళ వస్తే అది పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కి సీక్వెల్ గా  ఉంటుందా లేదా డిఫరెంట్ గా   ఉంటుందా అన్న డౌట్ లో జనాలు ఉన్నారు.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి 29 సంవత్సరాల్లో ఆస్కార్ కి సెలెక్ట్ అయిన సినిమా బాహుబలి


మరింత సమాచారం తెలుసుకోండి: