కమల్ హాసన్ హీరోగా నటించిన ఇండియన్ 2 సినిమా దర్శకుడు నిర్మాతల మధ్య విభేదాలు రావడంతో ఆగిపోయిన విషయం తెలిసిందే. భారీ తారాగణం నటించిన ఈ సినిమా ఒక్కసారిగా ఆగిపోవడంతో ఈ సినిమాను చూడాలని ఇష్టపడిన వారు నిరాశ పడ్డారు. భారతీయుడు సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. లంచ గొండి తనాన్ని రూపు మాపే నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసి మరొక భారీ హిట్ కొట్టాలని శంకర్ భావించాడు.

అయితే ఈ చిత్రం ఆర్థిక సమస్యల్లో కి వెళ్లి పోవడం ఆ తర్వాత దర్శక నిర్మాతల మధ్య విభేదాలు రావడం, కొన్ని యాక్సిడెంట్లు అవడం టెక్నీషియన్స్ చనిపోవడం వంటివి సినిమా ఆగిపోవడానికి కారణాలు అయ్యాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం సమకూరుస్తూ ఉండగా కోలీవుడ్ హీరో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు ఈ చిత్రంలో. అయితే ఈ చిత్రం మళ్లీ మొదలు పెట్టడానికి హీరో కమల్ హాసన్ ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు వృధా అవ్వక తప్పలేదు. 

ఏమైందో ఏమో తెలియదు గానీ కమల్ హాసన్ కూడా ఈ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తానని చెప్పి ఇప్పుడు చేతులెత్తేశాడు. కమల్ కూడా ఈ చిత్రం గురించి ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం తో దాదాపుగా ఈ సినిమా ఆగిపోయినట్లే అని చెప్పుకుంటున్నారు శంకర్ తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉండగా ఆయన ఖాళీ అవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఒకవేళ అన్నీ ఓకే అయినా శంకర్సినిమా చేయాలంటే సంవత్సరం అయిన వెయిట్ చేయాల్సిందే. ఈ నేపథ్యంలో సంవత్సరం తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎవరికి తెలుసు. నిర్మాతలు కోర్టు దాకా వెళ్లడంతో శంకర్ కు ఈ సినిమాపై మోహమెత్తేసి పోయింది. ఈ నేపద్యంలో ఇండియన్ 2 సినిM తెరకెక్కడానికి అన్ని దారులు మూసుకు పోయినట్లే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: