హీరోలకి సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక అటు బాలీవుడ్ హీరోలకి కాస్త పాపులారిటీ ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలు సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేశారు అంటే చాలు అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అంతేకాదు అటు సినీ సెలబ్రిటీలు ఎప్పుడు ఏం పోస్ట్ పెడతారా అని అటు అభిమానులు కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు.  సాధారణంగా సినీ సెలబ్రిటీలు వారి సినిమాలకు సంబంధించి లేదా నిజ జీవితానికి సంబంధించి ఏదైనా పోస్ట్ లు పెట్టడం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ సినీ సెలబ్రిటీలు ఒకరితో ఒకరు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకోవడం మాత్రం చాలా తక్కువగానే జరుగుతూ ఉంటుంది.



 ఇలా ఎప్పుడైనా ఇద్దరు హీరోలు కలిసి సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు అంటే అది అభిమానులందరినీ ఆకర్షిస్తుంది అనే చెప్పాలి. అంతే కాదు  సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారిపోతూ ఉంటుంది.  ఇకపోతే సోషల్ మీడియాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ఎంత యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్  సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాదు  తన నిజ జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

 ఇకపోతే ఇటీవలే రణవీర్ సింగ్ ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్న సమయంలో మరో బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ రణ్వీర్ సింగ్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు.  అర్జున్ కపూర్ అడిగిన చిలిపి ప్రశ్న కు అభిమానులు షాక్ అయ్యారు.  భయ్యా నువ్వు ఇంత సెక్సీగా ఎలా ఉంటున్నావ్ అంటూ అర్జున్ కపూర్ రణ్వీర్ సింగ్ ని అడిగాడు. ఇక దీనికి రిప్లై ఇచ్చిన రణవీర్ సింగ్  ఇదంతా నీ ట్రైనింగే కదా భయ్యా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇంతలో రణవీర్ సింగ్ భార్య దీపికా పదుకునే కూడా లైవ్ లో ఏవండీ ఇంటికి ఎప్పుడు వస్తారు అంటూ అడిగింది.  వేడివేడిగా వంట చేసి పెట్టు వచ్చేస్తున్నా బేబీ అంటూ రణవీర్ సింగ్ రిప్లై ఇచ్చాడు ఇలా ప్రముఖ సినీ సెలబ్రిటీలు పబ్లిక్ గా మాట్లాడుకోవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: