బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అనగానే రాజ్ కుమార్ ప్రొడక్షన్స్ గుర్తొచ్చినట్టు.. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ అనగానే అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ గుర్తొస్తుంది. ఇప్పటికీ నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టుగా సక్సెస్ఫుల్ సినిమాలతో దూసుకుపోతున్న అన్నపూర్ణ స్టూడియోస్ గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


అప్పట్లో దక్షిణ భారతదేశంలో సినీ పరిశ్రమ అనగానే మద్రాస్  పేరు వినిపించేది.. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషా చిత్రాలన్ని  మద్రాసు కేంద్రంగా సినిమాలను నిర్మించేవారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన పరిజ్ఞానమంతా మద్రాస్ సినీ పరిశ్రమలోనే ఉండడం గమనార్హం. సినీ రంగానికి సంబంధించిన మొత్తం పరిజ్ఞానం మద్రాసులోనే ఉండడంతో ఇతర భాషా నటులు కూడా మద్రాసుకి వచ్చి సినిమాలు తీస్తూ ఉండేవారు.. ఇక చాలా మంది హీరోలు కూడా మద్రాస్ లోనే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు..


1962 వ సంవత్సరం నుంచి హైదరాబాదులో సినిమాలు తీయడం మొదలు పెట్టారు. 1970సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లో సినిమా రంగం ఉండాలి అని మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైన సినిమా స్థానం కావాలి అని అప్పట్లో ఎంత మంది స్టార్ హీరోలు పోరాటం చేశారు. అయితే మనకు సినిమారంగం కావాలని అప్పటి మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్ రెడ్డి మంతనాలు జరిపిం చాడు. 1973 నాటి ముఖ్యమంత్రి జలగం చెంగలరావు గారి చొరవతో హైదరాబాద్ లో స్థలం కేటాయించడంతో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 1975 సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియోస్ ను ప్రారంభించాడు.

పెద్ద పెద్ద బండరాళ్లు, చెట్లతో నిండి ఉన్న, ఆ స్థలాన్ని చదును చేయడానికి ఏకంగా రెండు సంవత్సరాలపాటు శ్రమించాల్సి వచ్చింది. మొత్తం 22 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడానికి, అక్కినేని నాగేశ్వర రావు  ఎంతో శ్రద్ద తీసుకున్నారు. ఒకపక్క నిర్మాణ పనులు జరుగుతూనే, మరోపక్క  1976 జనవరి 14 వ నాటి రాష్ట్రపతి  ఫ్రకృద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించారు.11000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మొదటి అంతస్తు పూర్తి అయ్యింది. అప్పటికి హైదరాబాదులో చాలా తక్కువ సంఖ్యలో సినిమా షూటింగులు జరుగుతుండేవి.


అంతేకాదు ఏ దైర్యం తో  ఏఎన్ఆర్ స్టూడియో నిర్మిస్తున్నారు అని హేళన చేసిన వారు కూడా లేకపోలేదు. అన్నపూర్ణ స్టూడియో కంటే ముందే నిర్మించిన భాగ్యనగర్ స్టూడియోలో సినిమాలు లేక వెలవెలబోతున్న సమయంలో, ఈ స్టూడియోలో ఎవరు సినిమాలు తీస్తారు అంటూ పెద్దలు కూడా ఆశ్చర్యపోయారు.కానీ అక్కినేని నాగేశ్వరరావు నమ్మకం వమ్ము కాలేదు. ఇక ఒక సినిమా తీయడానికి కావలసిన అన్ని సెట్టింగ్స్ కోసం నాలుగు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయడంతో,  సినిమాలతో ఊపందుకుంది నిర్మాణ సంస్థ. హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో అన్నపూర్ణ స్టూడియోని ఏర్పాటు చేయడం..ఇక డబ్బింగ్, ఎడిటింగ్ లాంటి ఎన్నో అధునాతన టెక్నాలజీని రూపొందించడంతో మెల్లగా తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు  షిఫ్ట్ అవ్వడం జరిగింది.


ఆ తర్వాత పద్మాలయా స్టూడియో, ntr ఆర్ట్స్ లాంటి ఎన్నో సినీ ఇండస్ట్రీ లు ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో 99% అన్నపూర్ణ స్టూడియో లో నిర్మించిన సినిమాలన్నీ విజయవంతమవడంతో , ప్రతి ఒక్కరూ కనీసం కొంత భాగం అయిన ఈ స్టూడియో నిర్మాణం లో షూటింగ్ తీసుకునేవారు.. అంతలా నాటికీ నేటికీ మంచి విజయాలతో దూసుకుపోతోంది అన్నపూర్ణ స్టూడియోస్.


మరింత సమాచారం తెలుసుకోండి:

ANR