టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వివాదాస్పద దర్శకుడు గా ఉన్న రామ్ గోపాల్ వర్మ రోజుకో సంచలనం సృష్టిస్తూ అందరి దృష్టి తనపై ఉండేలా చేసుకుంటున్నాడు. ట్విట్టర్ వేదికగా ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ హీరోలు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ వారి అభిమానులను కించపరిచే విధంగా ఆయన పోస్టులు చేస్తాడు. అప్పుడప్పుడు అభిమానుల అంచనాలను రెట్టింపు చేసే హీరో ల గురించి పోస్టులు చేస్తూ పాజిటివ్ గా ఉంటాడు. కొన్నిసార్లు వారిని అవమాన పరిచేలా కూడా ఆయన పోస్టులు చేస్తూ ఉంటాడు.

ఈ విధంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్న రాంగోపాల్ వర్మ చేయని ప్రయోగం లేదు. శివ సినిమాతో దర్శకుడిగా మారి ఒక్కసారిగా టాలీవుడ్ లో క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు రామ్ గోపాల్ వర్మ. అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు దాదాపు అన్నీ కూడా ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఒకటి రెండు తప్ప మిగతావన్నీ తన సరదా కోసం తన సంతోషం కోసం మాత్రమే చేశాను అని చెబుతూ ఉంటాడు. ఇటీవల కాలంలో ఆయన మరింత దిగజారిపోయే సినిమా లు చేశాడు.

కనీసం ఓ కొత్త దర్శకుడు చేసే ప్రయత్నం కూడా సినిమా ల విషయం లో రామ్ గోపాల్ వర్మ చేయకపోవడం ఆయనకు సినిమాల పట్ల ఎంత శ్రద్ధ ఉందో చెప్పడానికి నిదర్శనాలు. బహుశా టాలీవుడ్ బాలీవుడ్ లలో సోషల్ మీడియా ను ఈ రేంజ్ లో ఉపయోగించే వారు లేరనే చెప్పాలి. భవిష్యత్తులో రామ్ గోపాల్ వర్మను సోషల్ మీడియా కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిన పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆరెంజ్లో నిత్యం సోషల్ మీడియా ఉపయోగిస్తూ జనాల నోళ్ళల్లో నానుతూనే ఉంటారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వీటిలో ఎప్పుడు ఏ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో చెప్పలేం. థియేటర్లలో విడుదల చేస్తాడా, లేదా ఓ టీ టీ లో విడుదల చేస్తాడా  అన్న విషయం కూడా ఆయనకు పెద్దగా తెలిసే ఆస్కారం ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: