టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొన్ని సంవత్సరాలు నెంబర్ వన్ స్థానంలో కొనసాగింది సమంత. ఏ మాయ చేసావే చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసి వారిని ఎంతగానో ఆకట్టుకుంది. అందానికి అందం అభినయానికి అభినయం కలగలిసిన ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ లో క్రేజ్ బాగానే పెరిగింది. ఆమె స్టార్ హీరోయిన్ కావడానికి పెద్దగా సమయం పట్టలేదు. మూడు నాలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి పెద్ద హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేక్షకులను తన సినిమాల ద్వారా అలరిస్తూ వచ్చింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఇప్పటివరకూ అలరిస్తూ వచ్చిన సమంత ఇకపై మరిన్ని సినిమాల్లో చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె నాగచైతన్య తో విడాకులు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉండగా వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆమె నటించిన శాకుంతలం సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. 

ఈ నేపథ్యంలోనే ఆమె మరొక వినూత్నమైన చిత్రాన్ని అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అక్కినేని సమంత ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా ఆమె తన ప్రేక్షకులకు అన్ని విషయాలను పంచుకొని వారిని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. ఇక ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ విషయానికి వస్తే తన ఇంస్టాగ్రామ్ లో దాదాపు 19 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నారు. ట్విట్టర్లో దాదాపు తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లు, ఫేస్బుక్ లో దాదాపు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు కలిగి ఉన్నారు. సోషల్ మీడియా క్వీన్ గా ఈమెకు మంచి బిరుదు కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: