కరోనా రెండో దశ తర్వాత టాలీవుడ్ సినిమా పరిశ్రమకు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో సిటీమార్ వంటి సినిమా టాలీవుడ్ కి పెద్ద హిట్ అందించడమే కాకుండా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే విషయంలో కొంత వరకు సక్సెస్ అయింది. అయితే 100కు 100% కాకున్నా 50% ప్రేక్షకులు థియేటర్లకు ఈ మాస్ సినిమాను చూడటానికి వస్తుండగా మరొక క్లాసికల్ హిట్ సినిమా రావాల్సిన అవసరం తప్పకుండా ఉందిమ్ ఈ సినిమా ప్రేక్షకులను వందకు వందశాతం థియేటర్లకు రప్పించే సినిమా అవుతుందని అంటున్నారు. ఇప్పుడున్న పొజిషన్ లో లవ్ స్టోరీ లాంటి సినిమా ధియేటర్ లలో పడడం అయితే అవసరం అయ్యింది. 

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తూండగా శేఖర్ కమ్ముల తన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కించగా మరొక సినిమా తో ఆయన హిట్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాదులో ఎంతో ఘనంగా జరగదా ఇప్పుడు రిలీజ్ ద్వారా టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ మొదలు పెట్టింది లవ్ స్టోరీ సినిమా.

ఈ సినిమాకి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి మరియు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ రాగా బాలీవుడ్ హీరోలు ఇప్పటివరకు తెలుగు సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఆ విధంగా ఇతర భాషల హీరోలను తెలుగు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు పిలిచే కొత్త ట్రెండ్ ను మొదలు పెట్టింది లవ్ స్టోరీ సినిమా అని చెప్పవచ్చు. నాగచైతన్య బాలీవుడ్ సినిమా లో నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రంలో అమీర్ ఖాన్ హీరో కాగా ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ అక్కినేని నాగచైతన్య తో కలిసి నటించడం వల్ల ఆయనతో సాన్నిహిత్యం పెరగడం వల్ల ఈ చిత్రానికి ముఖ్యఅతిథిగా ఆయన రావడం జరిగింది. ఏదేమైనా అమీర్ లాంటి హీరోను తెలుగు సినిమాకు గెస్ట్ గా తీసుకు రావడం అంటే అది నాగచైతన్య కు మాత్రమే చెల్లింది అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: