ఒకప్పుడు టాలీవుడ్ హీరోలు పాపులారిటీ లాంటివి తెచ్చుకోవడం విషయంలో దేశవ్యాప్తంగా క్రేజ్ ను తెచ్చుకోవడం విషయంలో చాలా వెనుకబడి పోయి ఉండేవారు. ఇతర భాషల హీరోలతో పోలిస్తే మన తెలుగు హీరోలు బాలీవుడ్ లో కానీ నార్త్ సినిమా ఇండస్ట్రీlలో గానీ పెద్దగా క్రేజ్ ఉండేది కాదు. తమ మార్కెట్ ను అక్కడ పెంచుకునే విధంగా వెనకబడి పోయేవారు. అంతేకాదు అక్కడ సినిమాలను విడుదల చేసిన కూడా వాటిని హిట్ సినిమాలు గా మార్చుకోవడం లో తేలిపోయారు కానీ ఇప్పటి తరం హీరోలు అన్ని భాషలలో తమ పేరు మారుమోగిచుకోవడం లో తమకు క్రేజ్ ను ఏర్పరుచుకోవడం లో ఇతర భాషల హీరోలతో పోలిస్తే రాటు దేలిపోయారు.

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా సినిమా అంటేనే దేశంలోని ఏ భాషలో అయినా సినిమాను విడుదల చేసుకోవచ్చు. ఆ విధంగా మన హీరోలు వారు చేసే ప్రతి సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేస్తూ అన్ని భాషలలో తమకు క్రేజ్ పెరిగేలా చేసుకుంటున్నారు. బాహుబలి సినిమా దీనికి పునాదులు వేసింది అని చెప్పవచ్చు. 5 ఏళ్ళు కష్టపడి ప్రభాస్ బాహుబలి సినిమా తీస్తే ఆయనకు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది.

దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఆ విధంగానే మిగిలిన టాలీవుడ్ హీరోలు కూడా తమ క్రేజ్ ను అన్ని భాషలలో పెంచుకునే విధంగా ముందు అడుగులు వేస్తున్నారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ వంటి హీరోలు ఇప్పుడు ఆ తరహా సినిమాలు చేస్తూ ఉండగా వారు తమ పాపులారిటీని పెంచుకునేందుకు వినూత్నమైన వెరైటీ పబ్లిసిటీ లు చేసుకుంటున్నారు.  ఈ విధంగా మన హీరోలు తమ పాపులారిటీ పెంచుకునే విషయం లో రాటుదేలిపోయారు అని చెప్పవచ్చు. మరి భవిష్యత్తులో పాన్ వరల్డ్ సినిమాల ఎంపికల విషయాలలో హీరోలు ఎలాంటి విరుద్ధమైన ప్రయోగాలన చేస్తారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: