1923 సెప్టెంబరు 20 వ తేదీన అక్కినేని వెంకటరత్నం - పున్నమ్మ దంపతులకు అక్కినేని నాగేశ్వరరావు.. గుడివాడ దగ్గర్లో ఉన్న వెంకట రామాపురం అనే గ్రామంలో జన్మించాడు. ఇక ఈ దంపతులకు ఐదు మంది పుత్రులు అయితే చివరి వారు అక్కినేని నాగేశ్వరావు. ఇక తన తండ్రి అక్కినేనికి మూడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే, మరణించడంతో వీరికున్న 25 ఎకరాల ఆస్తిని అన్నదమ్ములు పంచుకున్నారు. ఇక చిన్నప్పటినుంచి పాటలు పాడడం, భజనలు చేసే వారి వెనకాల వెళ్లడం బాగా అలవాటు. ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఇంట్లో ఏ ఒక్కరు కూడా చదువుకోలేదు. ఎంతలా అంటే కేవలం సంతకం మాత్రమే చేసే వరకు నేర్చుకున్నారు .


కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అక్కినేని నాగేశ్వరరావు, ఒకరోజు పాఠశాలల్లో హరిశ్చంద్ర నాటకం లో నారదుడి పాత్ర వేసి మెప్పించాడు. ఇక ఏఎన్ఆర్ నటన విధానాన్ని చూసి ,ఆ తర్వాత చంద్రమతి పాత్ర ఇచ్చారు. ఆ పాత్ర కోసం తన అమ్మకు తెలియకుండా చీరను దొంగతనం చేసి ,ఆ పాత్రలో జీవించారు అని చెప్పవచ్చు.  ఈ విషయం తెలుసుకున్న వాళ్ళమ్మ చంద్రమతి పాత్రను చూసి ఎంతో మెచ్చుకుంది. ఇక వీళ్ల అన్నయ్య రామబ్రహ్మం తో పాటు వాళ్ళ అమ్మ నాటకాలకు ప్రోత్సహించడంతో తన నాటకాలలో మంచి ప్రావీణ్యం పొందాడు.

ముందు నుంచి వీళ్ళ పెద్దన్నయ్య ప్రోత్సాహంతోనే సినీ ఇండస్ట్రీలోకి ధర్మపత్ని సినిమా ద్వారా అడుగుపెట్టాడు. ఇక ఈ సినిమాకి వంద రూపాయల పారితోషికం కూడా అందుకున్నారు. ఇక తర్వాత 1944 మే 7వ తేదీన మద్రాసు వెళ్లి ఇక అక్కడే తన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక మూలస్తంభంగా.. చిత్ర పరిశ్రమను భారతదేశం గుర్తించే విధంగా తన నటనతో మంచి ప్రావీణ్యం పొందారు.. ఇక చివరిసారిగా 2014లో మనం సినిమా ద్వారా ఆయన సినీ జీవితానికి స్వస్తి చెప్పడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

ANR