కొంతమంది కథానాయికలు చేసేవి కొన్ని సినిమాలే అయిన కూడా వారికి అభిమానులు మాత్రం ఒక రేంజ్ లో ఉంటారు. దానికి కారణం సినిమాల్లో తక్కువగా కనిపించిన కూడా వారు సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారు. అలాంటి కథానాయికల్లో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అనుపమ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే. అందులో బాగా ఆడిన సినిమాలు శతామనంభవతి , అ.. ఆ . ఇవి తప్ప ఆమెకి సరైన హిట్స్ లేవు. కానీ ఆఫర్స్ విషయంలో మాత్రం మంచి స్పీడ్ లోనే ఉంది.

ప్రస్తుతం నిఖిల్ తో కలిసి 18 పేజెస్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అదే నిఖిల్ తో కార్తికేయ 2 లో కూడా జోడి కట్టబోతుంది.అయితే అనుపమకి ఇంత క్రేజ్ ఉండటానికి ముఖ్యమైన రీసన్ ఆమె సోషల్ మీడియాలో పెట్టె పోస్ట్స్. ఆమెకి ఇంస్టాగ్రామ్ లో దాదాపుగా కోటిమంది పైనే ఫాలో అవుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో. అలాగే అనుపమ చేసే టిక్ టక్ రీల్స్ కి లక్షల్లో లైక్స్ వస్తాయి. ఆమె పెట్టె ఫోటోస్ , రీల్స్ తో ఎప్పుడు అనుపమ తన అభిమానులకి దగ్గరగానే ఉంటుంది.

ఇదే కాకుండా అనుపమ తన సోషల్ మీడియాలో బ్రాండ్ ని ప్రమోట్ చేసి కూడా మంచి డబ్బులు సంపాదిస్తుంది. ఈ మద్యనే ఆమె చేసిన ఫ్రీడమ్ యట్ మిడ్నైట్ షార్ట్ ఫిల్మ్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ ని కోటి 50 లక్షల మంది చూడటం నిజంగానే విశేషం. ఇక అనుపమ దగ్గర ఉన్న ఇంకొక టాలెంట్ ఏంటి అంటే ఆమె బొమ్మలు కూడా చాలా చక్కగా గీయ్యడం. దానికోసం ఒక ప్రత్యేక ఇంస్టా ఛానల్ పెట్టి అందులో ఆమె గీసిన అందమైన చిత్రాల్ని పోస్ట్ చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: