తెలుగు సినిమా పరిశ్రమలో టాలెంటెడ్ హీరోయిన్ అయిన సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అనే విషయం అందరికి తెలిసిందే. సాయిపల్లవి చేసే డ్యాన్స్ కోసమే సినిమాలను చూసే అభిమానులు సైతం సినీ పరిశ్రమలో ఉన్నారని తెలుస్తుంది.

సాయిపల్లవితో పోటీ డ్యాన్స్ చేయాలంటే తేలిక అయిన విషయం కాదని తెలుస్తుంది.. స్టార్ హీరోల సినిమాలలో ఆఫర్లు రాకపోయినా సాయిపల్లవికి టాలీవుడ్ లో నటనకు ప్రాధాన్యం వున్న ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతన్య సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లవ్ స్టోరీ డ్యాన్స్ బేస్డ్ సినిమా అనే విషయం అందరికి తెలిసిందే.

లవ్ స్టోరీ సినిమాలో నాగచైతన్య కూడా జుంబో డ్యాన్స్ ఇన్ స్ట్రక్చర్ గా చేసాడని సమాచారం. అలాగే ఒక ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమా కొరకు చాలా కష్టపడ్డానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. అయితే లవ్ స్టోరీ సినిమాలో మాత్రం సాయిపల్లవితో పోటీ పడి చైతన్య స్టెప్పులు వేశారని సమాచారం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్య చాలా బాగా డ్యాన్స్ చేశారని చెప్పుకొచ్చిందట .

సినిమాలో రైన్ సాంగ్ మరియు సారంగ దరియా పాటకు డ్యాన్స్ చేయడం కష్టమైందని సాయిపల్లవి చెప్పినట్లు సమాచారం. ఎంతో కష్టపడి సారంగదరియా మరియు రైన్ సాంగ్ చేశానని సాయిపల్లవి తెలిపినట్లు సమాచారం. సాయిపల్లవి మరియు నాగచైతన్యల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందో లేదో చూడాలి మరి. నాగ చైతన్య కెరీర్ లో లవ్ స్టోరీ బెస్ట్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో నాగ చైతన్య 50 కోట్ల షేర్ కలెక్షన్లు సాధిస్తాడని అందరూ అనుకుంటున్నట్లు సమాచారం.

నాగచైతన్య, సాయిపల్లవి తొలిసారి కలిసి ఈ సినిమాలో నటిస్తుండగా శేఖర్ మాస్టర్ ఈ సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ అందించారు. ఫిదాకు భిన్నమైన కథను తెరకెక్కిస్తున్న శేఖర్ మాస్టర్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటారో చూడాల్సి ఉంది. సాయిపల్లవి ఈ మూవీతో ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: