మెగాస్టార్ చిరంజీవి..  ఇది తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం అక్కర్లేని పేరు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చిన చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమను ముందుకు నడిపించే మూలస్తంభంగా కొనసాగుతున్నారు. ఒక సాదా సీదా నటుడిగా ప్రస్థానం ప్రారంభించి తన నటనతో దర్శకనిర్మాతలను ఆకర్షించి ఇక ఆ తర్వాత హీరోగా అవతారమెత్తాడు. అప్పటికే  ఎన్టీఆర్ కృష్ణ లాంటి వాళ్ళు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ వాళ్లందరినీ వెనక్కి నెట్టి ఏకంగా కొత్త ట్రెండ్ ను సృష్టించారు చిరంజీవి.


 వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తూ ఇక తెలుగు ప్రేక్షకులందరికీ మెగాస్టార్ గా మారిపోయారు.  ఇప్పటికీ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. అయితే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మూలస్తంభంగా కొనసాగుతున్న చిరంజీవి నటుడిగా చిత్ర పరిశ్రమకు పరిచయమైంది ప్రాణంఖరీదు అనే సినిమా ద్వారా అన్నది తెలిసిందే. అయితే ఇటీవలే ఈ రోజే నా పుట్టినరోజు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఒక ట్విట్ పెట్టగా అది కాస్త వైరల్ గా మారిపోయింది.



 అదేంటి చిరంజీవి పుట్టినరోజు అయిపోయింది కదా.. మళ్ళీ ఇప్పుడు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా.. అయితే మొన్న ఆయన ఈ భూమిమీద పడిన రోజు అయితే.. ఇక నేడు ఆయన చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రోజు ఇక ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఒకటి ట్విట్ పెట్టారు. 1978 సెప్టెంబర్ 22వ తేదీన నటుడిగా నేను పుట్టిన రోజు తెలుగు తెరకు పరిచయం అయిన రోజు.. ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ఇక తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: