వైసీపీకి, జగన్ కి టాలీవుడ్ ఎపుడూ సహకరించిన దాఖాలు లేవు. నిజానికి చలన చిత్ర సీమలోనూ రాజకీయాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలూ ఉన్నాయి. ఎన్టీయార్ పార్టీ పెట్టనంతవరకూ కాంగ్రెస్ కి కొందరు నటులు సపోర్ట్ చేసేవారు. ఆ తరువాత కొంతమంది ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు కూడా.

ఆ విధంగా కొంగర జగ్గయ్య ఒంగోలు నుంచి ఎంపీ అయిన తొలి తెలుగు సినీ రాజకీయ నేతగా  గుర్తింపు పొందారు. ఎన్టీయార్ పార్టీ పెట్టడంతో అంతవరకూ తెర వెనక ఉన్న రాజకీయ బంధాలు తెర ముందుకు వచ్చేశాయి. ఇదిలా ఉంటే టాలీవుడ్ లో తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన వారూ ఉన్నరు. ఇక మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా పార్టీని పెట్టారు. ఇపుడు అలా చూసుకుంటే టాలీవుడ్ లో వైసీపీకి మద్దతు ఇచ్చే నటులు కూడా పెద్దగా లేరు అనుకోవాలి. దీంతో జగన్ కూడా టాలీవుడ్ మీద గట్టిగానే దృష్టి సారించారు.

ఆన్ లైన్ టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టడం వెనక కూడా చాలా విషయాలు ఉన్నాయని అంటున్నారు. టాలీవుడ్ లో అగ్ర హీరోలదే రాజ్యం, వారి సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకుంటూ వస్తున్నారు. ఇక అగ్ర కధా నాయకుల సినిమాలకు తొలి రెండు వారాల పాటు టికెట్ల రేట్లు పెంచి మరీ భారీగా కలెక్షన్లు కొల్లగొడుతున్నారు. అయితే ఇందులో వైట్ మనీ ఎంత బ్లాక్ ఎంత అన్న లెక్కలు తేలలేదు. ఎవరూ చెప్పలేదు కూడా. ఒక విధంగా సినిమా తీసిన నిర్మాత కూడా తన సినిమా కలెక్షన్ల లెక్కలు తెలియక అలాగే ఉంటున్నాడు.

ఈ నేపధ్యంలో ఏపీ సర్కార్ ఆన్ లైన్ టికెట్లను ప్రవేశపెట్టడం పట్ల నిర్మాతల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. కలెక్షన్ల లెక్క పక్కాగా ఉంటుంది అన్నది వారి ఆనందం. మరో వైపు పైసా కూడా ప్రభుత్వానికి పన్ను రూపంలో పోకుండా ఉంటుంది. చిన్న నిర్మాతలకు కూడా లాభసాటిగా ఉంటుంది. అయితే ఇక్కడ దెబ్బ తినేది మాత్రం పెద్ద హీరోలు, స్టార్ డైరెక్టర్లు మాత్రమే అంటున్నారు. దాంతో వారంతా జగన్ సర్కార్ నిర్ణయాల పట్ల గుర్రుగా ఉన్నారని టాక్. మరి ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గదు. దాంతో ఇపుడు చిత్ర సీమలో  పెద్ద కామందులు ఏం చేస్తారు అన్నది చూడాలి. ఏపీలో ఆన్ లైన్  టికెట్ సిస్టం తెలంగాణా కూడా రేపటి రోజున ఫాలో అయితే కచ్చితంగా టాలీవుడ్ టాప్ ర్యాంకర్లకు   దెబ్బ పడుతుంది అనడంలో సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: