సినిమా పరిశ్రమలో హిట్ వచ్చినప్పుడు వారికి ఉండే ఆ క్రేజే వేరు. అందరు కూడా ఆ సక్సెస్ అయిన వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు వాలినట్లు సక్సెస్ ఉన్నప్పుడు ఈ విధంగా వారి చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎవరు మరచిపోలేని హిట్ సంపాదించిన సంపత్ నంది చుట్టూనే అందరు హీరోలు పడుతున్నట్లుగా తాజాగా ఆయన పై వస్తున్న రూమర్స్ ను బట్టి చెప్పవచ్చు. ఇటీవలే గోపీచంద్ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సీటీ మార్ చిత్రం విడుదలై ప్రేక్షకుల నుండి మంచి పేరు రాగా పెద్ద పెద్ద హీరోల దగ్గర నుంచి ఆయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ఇప్పటికే చిరంజీవితో ఆయన సినిమా చేయబోతున్నట్లు వార్త బయటకు వస్తుండగా పవన్ కళ్యాణ్ కూడా సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. అంతే కాదు రవితేజ హీరోగా విక్రమార్కుడు సీక్వెల్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ చేయడం అంటే సీటీ మార్ హిట్ సినిమాలో సంపత్ నంది క్రేజ్ ఏ రేంజ్ లో పెంచిందో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి సినిమా నే దర్శకత్వం వహించడం అంటే ఆయన రేంజ్ మామూలు గా పెరగలేదని చెప్పాలి.

తాజాగా సంపత్ నంది మరొక పెద్ద హీరో తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఇటీవలే ఆయన విక్టరీ వెంకటేష్ కి ఓ కథ వినిపించారని అది దాదాపు ఒకే అయ్యే స్టేజీలో ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలు రావడం చూస్తుంటే ఆయనకు క్రేజ్ భారీ గానే పెరిగిపోయిందని చెప్పవచ్చు. మరి సిటీ మార్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సంపత్ నంది ఈ సినిమాని, ఏ హీరో తో సినిమా నీ ఓకే చేసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: