నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'లవ్ స్టోరీ'. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా విజృంభించడంతో వాయిదా పడుతూ వచ్చింది. అప్పట్లో ఒకసారి ఈ సినిమాను వినాయకచవితి సందర్భంగా విడుదల చేయాలని చిత్రబృందం అనుకున్నా కానీ కుదరలేదు. తాజాగా ఈ మధ్యనే ఈ సినిమాను ఈ నెల సెప్టెంబర్ 24 వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం మరొకసారి ప్రకటించింది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే జనాలను ఎంతగానో మెప్పించాయి. సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ సినిమా బృందం ప్రముఖ చానళ్ల ఇంటర్వ్యూలలో పాల్గొంటూ హల్చల్ చేస్తున్నారు.

 ఇదే క్రమంలో ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించిన పవన్ సిహెచ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'లవ్ స్టోరీ' సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. మా తాతయ్య నాన్న ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు. నాకు మాత్రం చిన్న వయస్సు నుండి సంగీతం అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని గ్రహించిన మా పేరెంట్స్ నన్ను ఆ దిశగానే ప్రోత్సహించారు. నా టాలెంట్ ను గుర్తించిన రెహమాన్ నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఆయన దగ్గర శివాజీ, రోబో, సర్కార్ మొదలైన సినిమాలకు పనిచేశాను. ఆ తర్వాత సంగీత దర్శకుడు అవ్వాలని పట్టుదలతో ప్రయత్నం చేశాను. ఆ సమయంలోనే దర్శకుడు శేఖర్ కమ్ముల 'ఫిదా' సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. వెంటనే వెళ్లి శేఖర్ కమ్ముల గారికి కలిశాను. నా గురించి చెప్పాను, ప్రస్తుతం కొత్తవాళ్లతో రిస్క్ చేసే ఆలోచన లేదు అని చెప్పారు. దానితో నేను నిరాశగా వెనుదిరిగారు. ఆ తర్వాత 'లవ్ స్టోరీ' మూవీకి ఆయనే పిలిచారు. నేను హే పిల్లా పాట చేసి వినిపించాను. ఆయనకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత కూడా నాకు చాలా టెస్ట్ లే పెట్టాడు. అలా 'లవ్ స్టోరీ' సినిమాలో అవకాశం వచ్చింది. 'లవ్ స్టోరీ' సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది అంటూ పవన్ సిహెచ్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: