అందం అంతకుమించిన అభినయం కలగలిపిన తార అమలా పాల్. ఈ కేరళ కుట్టి తమిళంలోనే కాదు ఇటు తెలుగులోనూ గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అసలు పేరు అనఖ పాల్ కాగా ఆ తరవాత అమలా పాల్ గా మార్చుకున్నారు. నీల తామర అనే సినిమాలో సహాయక పాత్రలో నటించిన అమలా పాల్ ఒక్కో మెట్టు ఎక్కుతూ తన నటనా ప్రతిభతో హీరోయిన్ గా అవకాశాలను అందుకుంటున్నారు. నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు, లవ్ ఫెయిల్యూర్ వంటి తెలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది. ఇటీవలే ‘ఆహా’ ఓటీటీ వేదిక పై విడుదలైన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ లో అమలా పాల్ మరోసారి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది.

తన సినీ జీవితంలో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంటుంటారు అమలాపాల్. ఇక ఈమె వ్యక్తిగత జీవితం విషయానికొస్తే...నటిగా ఫుల్ ఫామ్ లో ఉన్న సమయం లోనే కోలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమలో పడిందని, సహజీవనం చేస్తుందని వార్తలు హాల్ చల్ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంత కాలం ఎంతో సంతోషంగా జరిగిన వీరి కాపురంలో కలతలు మొదలయ్యాయి, అవి అమలా పాల్ ఇంక సినిమాలో నటించదు అని దర్శకుడు విజయ్ చెప్తే  అమలా పాల్ వినకపోవడం వలనే ఏర్పడిన విభేదాలని అప్పట్లో చాలా కథనాలే వినిపించాయి.

ఒకానొక సమయంలో విజయ్ తండ్రి అయిన అళగప్పన్ ఓ ఇంటర్వ్యూలో వీరు విడిపోవడానికి కారణం హీరో దనుషే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ అసలు  కారణాలు మాత్రం క్లారిటీ గా బయటకు తెలియలేదు గాని  రెండేళ్లకే చట్టపరంగా విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు జీవిస్తున్నారు డైరెక్టర్ ఏఎల్ విజయ్ మరియు అమలా పాల్ లు . డైరెక్టర్ ఏఎల్ విజయ్ ఓ ప్రముఖ వైద్యురాలుని రెండో వివాహం చేసుకోగా అమలా పాల్ మాత్రం సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. డైరెక్టర్  విజయ్ సంతానంతో తన కుటుంబ జీవితాన్ని హాయిగా కొనసాగిస్తుండగా, అమలా పాల్ విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: