తమిళ, తెలుగు చిత్రాలతో సహా హిందీ సినిమాలలో సైతం సైలెంట్ గా సినిమాలు చేస్తూ వస్తోంది 'అర్జున్ రెడ్డి' భామ షాలిని పాండే. 2017 లో 'అర్జున్ రెడ్డి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో సినీ రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆమె రెండు బాలీవుడ్ చిత్రాలకు సంతకం చేసింది. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ద్వారా తన బాలీవుడ్ ఫిల్మ్ వెంచర్ ప్రారంభించింది. మొదటిది సోషల్ కామెడీ "జయేశ్‌భాయ్ జోర్దార్", మరొకటి బయోపిక్ "మహారాజా". ఈ నటి బాలీవుడ్ దిగ్గజాలతో కలిసి పని చేయడానికి సిద్ధమైంది. కెరీర్ తొలినాళ్లలోనే అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేయడం అనే మామూలు విషయం కాదు. పైగా ఈ సినిమాల కోసం బొద్దుగుమ్మగా ఉన్న షాలిని సన్నజాజి తీగలా తయారయ్యింది. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.

షాలిని పాండే గురించి మీకు తెలియని 8 విషయాలు :
1. ఇష్టమైన నటీనటులు
షాలిని అభిమాన నటుల విషయానికి వస్తే బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్. వారిద్దరూ షాలిని అమితంగా ఇష్టపడే స్టార్స్. వారిలాగే తను కూడా పని పట్ల నిరంతర అంకితభావంతో ఉండాలని కోరుకుంటుంది. వారిని స్ఫూర్తిగా భావిస్తుంది.

2. మొదటి సినిమాకే డబ్బింగ్
ఈ బ్యూటీకి తెలుగు భాష పెద్దగా రాదు. అయినప్పటికీ తన పాత్రకు వాయిస్ ను అరువు తెచ్చుకోకుండా తొలి చిత్రం 'అర్జున్ రెడ్డి'కి తానే డబ్బింగ్ చెప్పుకుంది.

3. ఫుడ్ ఫ్యూజన్
షాలినికి ఫుడ్ ఫ్యూజన్‌ ఒక అభిరుచి. ఆమె ఎప్పుడూ వివిధ రకాల ఆహార పదార్థాలను తినడానికి, కొత్త వాటిని టేస్ట్ చేయడానికి ఇష్టపడుతుంది. అయితే ఆమె గ్రీన్ వెజిటేబుల్స్, సలాడ్స్ తీసుకోవడం ద్వారానే తన ఫిజిక్ ను మైంటైన్ చేస్తుంటుంది.

4- ఇష్టమైన సినిమా
సినీ ప్రేమికురాలిగా, నటి తనకు సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంది, కానీ తనకు ఇష్టమైన సినిమా విషయానికి వస్తే, 'ఎ క్లాక్ వర్క్ ఆరెంజ్' అనే దాని పేరును షేర్ చేయడం మర్చిపోదు.

5. సక్తిగల రీడర్
షాలిని మంచి రీడర్. పుస్తకాలు చదవడానికి ఆమె బాగా ఇష్టపడుతుంది. ఆమెకు రోజూ రాత్రి పడుకునే ముందు పుస్తకాలు చదవడం అలవాటు. పని చేసిన తర్వాత బుక్స్ చదవడం మనశ్శాంతిని ఇస్తుందని ఆమె నమ్ముతుంది.

6. షాలిని క్లోజ్ ఫ్రెండ్ హీరోయిన్
ఆమె అభిమానులలో చాలా మంది ఆమె బెస్ట్ బడ్డీ గురించి తెలుసుకోవాలనుకుంటారు. కోలీవుడ్ హీరోయిన్ రితికా షాలిని క్లోజ్ ఫ్రెండ్స్. ఈ విషయం చాలామందికి తెలియదు. 'గురు' బ్యూటీ రితికా సింగ్ ఆమె సన్నిహిత స్నేహితురాలు.

7. ఇన్‌స్టాగ్రామ్‌ పిచ్చి
షాలిని పాండేకి ఇన్‌స్టాగ్రామ్‌ అంటే పిచ్చి. ఎందుకంటే అక్కడ ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులతో కనెక్ట్ అవ్వడాన్ని బాగా ఇష్టపడుతుంది.

8. ఇష్టమైన గాయకుడు
షాలిని సంగీత ప్రేమికురాలు. ఆమె అభిమాన గాయని నేహా కక్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: