స్టార్ హీరోలకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు ఉపయోగించే కార్లు ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.  మామూలుగా సినీ సెలబ్రిటీలు కాస్లీ కార్లు కొనడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.  అయితే ఇలా కాస్ట్లీ కార్ లు కొనడమే కాదు ఈ కాస్ట్లీ కార్ ల కు ఆకర్షణీయమైన ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని భావిస్తూ ఉంటారు. దీని కోసం భారీగా ఖర్చు చేయడానికి సైతం సిద్ధ పడి పోతూ ఉంటారు సినీ సెలబ్రిటీలు.



 ఫ్యాన్సీ నెంబర్ ల కోసం కొంతమంది సినీ సెలబ్రిటీలు చేసే ఖర్చు అటు అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి పని చేసి అభిమానులను షాక్కు గురి చేశారు.  తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే సమయంలో అటు బుల్లితెరపై కూడా ఎవరు మీలో కోటీశ్వరుడు అనే కార్యక్రమంలో ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరవుతున్నాడు. అయితే ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఒక కాస్ట్లీ కారు కొనుగోలు చేశాడట. ఈ కారుకు ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకునేందుకు ఇటీవలే వేలంపాటలో కూడా పాల్గొన్నారు జూనియర్ ఎన్టీఆర్.



 ఈ వేలం పాటలో లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక ఫ్యాన్సీ నెంబర్లు సొంతం చేసుకున్నాడట. ఇటీవలే ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో ఫ్యాన్సీ నెంబర్ లకు సంబంధించిన వేలంపాట జరిగిందట. ఇక ఈ వేలంపాటలో F9 FS9999 అనే ఫ్యాన్సీ నెంబర్ ను జూనియర్ ఏకంగా 17 లక్షలు ఖర్చు చేసి దక్కించుకున్నాడట. ఇక ఎన్టీఆర్ తో పాటు ఫ్యాన్సీ నెంబర్లు దక్కించుకునేందుకు పలువురు వ్యాపార వేత్తలు కూడా ఈ వేలం పాటలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాన్ని ఇటీవలే హైదరాబాద్ ఐటీసీ పాండు రంగ నాయక్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: