పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సారి స్వీయ దర్శకత్వంలో తన వంతు ప్రయత్నించి, వచ్చిన సినిమా జానీ.. ఈ సినిమా మీద ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నారు అభిమానులు.. కానీ బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్ ను చవిచూడాల్సి వచ్చింది.. మొత్తానికి ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో మరోసారి పవన్ కళ్యాణ్ దర్శకత్వం వైపు వెళ్ళ లేదనే చెప్పాలి.. చివరి ప్రయత్నంగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి కూడా తన వంతు సహాయంగా దర్శకత్వం లో సహాయం చేశాడు.. ఈ సినిమా కూడా భారీ డిజాస్టర్ ను చవి చూడడం తో పవన్ కళ్యాణ్ కు దర్శకత్వం అచ్చి రాలేదు అని కూడా ఋజువైంది.. ఈ సినిమా విశేషాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


తెలుగు సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న గబ్బర్ సింగ్ సినిమాకు సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ 2016 లో భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమాను ఎన్నో అంచనాల మధ్య విడుదల చేయడం జరిగింది. కానీ  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బిజినెస్ ను  సొంతం చేసుకున్నా.. డిజాస్టర్ గా మిగిలింది. ఇక తెలుగు వెర్షన్ కు రూ.83.4 కోట్ల బిజినెస్ జరగగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో ఈ సినిమా రూ.89.6 కోట్ల బిజినెస్ జరిగింది. డిజాస్టర్ అయినప్పటికి 50 కోట్ల కలెక్షన్లు రూపాయలను వసూలు చేసి ఫ్లాప్ మూవీస్ లో హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలబడింది. కానీ ఈ సినిమా మొత్తంగా చూసుకుంటే  37 కోట్ల రూపాయల లాస్ ను చవిచూసింది.

కథ పరంగా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేక భారీ డిజాస్టర్ గా మిగిలింది.. ఈ కథను పవన్ కళ్యాణ్ రూపొందించగా కె.ఎస్.రవీంద్ర, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి దర్శకత్వం వహించారు. హీరోయిన్ కాజల్ నటించినప్పటికీ సినిమా మాత్రం భారీ డిజాస్టర్ ను చవిచూడక తప్పలేదు. అందుకే  ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ దర్శకత్వం జోలికి పోరని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: