ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం టాలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా శక్తి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించగా ఈ సినిమా పై భారీ  అంచనాలు ఏర్పడడమే ఈ సినిమా అతి దారుణంగా ఫ్లాప్ అవడానికి కారణాలు. సోషియో ఫాంటసీ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కే ఓ మచ్చగా మిగిలిపోయింది అని చెప్పవచ్చు.

విశ్వాన్ని కాపాడే శక్తి పీఠాలకు కాపలాగా ఉంటాడు హీరో తండ్రి. ఓ దుష్ట శక్తి సహాయంతో ఆ శక్తిపీఠాలను వశం చేసుకొని ప్రపంచాన్ని ఏలాగైనా ఏలాలని విలన్ శక్తిపీఠాలను ఆధీనం చేసుకునే క్రమంలో హీరో తో తలపడి చనిపోతాడు. హీరో కూడా అదే ప్రమాదంలో చనిపోతాడు. ఆ సమయంలో వారిద్దరి సుపుత్రులు ఆ తర్వాత ఏ విధంగా శక్తి పీఠాల కోసం తలపడ్డారు. ఏ విధంగా హీరో విలన్ ను అంతమొందించాడు అనేదే ఈ సినిమా కథ. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి ఆమె అందాలు కూడా ఏమాత్రం తోడు రాక భారీ ఫ్లాప్ అయ్యింది.

ఈ సినిమాకు నటీనటుల ఫెయిల్యూర్ కంటే టెక్నీషియన్స్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు ఎంచుకున్న సబ్జెక్ట్ దీనికి ప్రధానమైన డ్రా బ్యాక్. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో కి ఈ విధమైన సోసియో ఫాంటసీ కథను ఎంచుకొని దాన్ని భారీ రేంజ్ లో మార్కెట్ చేసి సినిమా లో ఎటువంటి విషయం లేకుండా విడుదల చేయడం ఈ సినిమా ఫ్లాప్ కావడానికి అతిపెద్ద కారణం. సంగీతంతో మణిశర్మ ఫర్వాలేదనిపించినా ఆయన ఒక్కడు ఇంత భారీ సినిమాను హ్యాండిల్ చేయలేకపోయాడు. ఇతర నటీనటులు కూడా తమ వంతు ఈ సినిమా హిట్ కావడానికి కృషి చేయగా దర్శకత్వ లోపం వలన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: