సినిమాల‌లో షూటింగ్ స‌మ‌యంలో న‌టీన‌టుల మ‌ధ్య వివాదాలు త‌లెత్త‌డం సాధార‌ణ‌మే. ఏదో ఒక విష‌యంలో ఇద్ద‌రి అభిప్రాయాలు ఒకేర‌కంగా ఉండ‌క‌పోయినా..చిన్న చిన్న ఇష్యూలు రావ‌డం కామ‌న్. అలానే ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌ల మ‌ధ్య చిన్న ఇష్యూ వ‌చ్చి వివాదం నెల‌కొంది అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో తెలుగింటి అమ్మాయిలా ఉండే బొద్దుగుమ్మ నివేధితా తామ‌స్ మరియు తన యాక్టింగ్ గ్లామ‌ర్ తో క‌ట్టిప‌డేసిన హీరోయిన్ రెజీనా మ‌ధ్య వివాదం నెల‌కొంద‌ని దాంతో ఇద్ద‌రూ మాట్లాడుకోవ‌డం లేద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. రెజీనా మ‌రియు నివేధిత సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు. 

ప్ర‌స్తుతం ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఈ సినిమా షూటింగ్ లోనే బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు రేగింద‌నేది టాలీవుడ్ టాక్. దాంతో ఇద్ద‌రూ కూడా మాట్లాడుకోవ‌డం లేద‌ట‌. దాంతో ఇద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ మాటలు క‌లిపేందుకు చిత్ర యూనిట్ కూడా ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి ఓ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అందులో న‌టించే వారి మ‌ధ్య సంబంధాలు భాగుంటేనే క‌లిసి న‌టించేందుకు కూడా భాగుంటుంది .

ఏదైనా సన్నివేశంలో న‌టించాల‌న్నా ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు ఉంటే చ‌ర్చించుకుని మ‌రింత భాగా న‌టించే అవ‌కాశం ఉంటుంది. ఇక ఇద్ద‌రి మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డం ఇప్పుడు చిత్ర యూటిన్ కు త‌ల‌నొప్పిగా మారింది. ఇది ఇలా ఉంటే..నివేధితా తామ‌స్ ఇటీవ‌లే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన వ‌కీల్ సాబ్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. సినిమాలో నివేధితా న‌టించిన సీన్ల‌కు మంచి మార్కులు ప‌డ్డాయి. ఇక రెజీనా ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ లు మరియు సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగుతో పాటు రెజీనా ఇత‌ర భాష‌ల్లో కూడా న‌టిస్తోంది .

మరింత సమాచారం తెలుసుకోండి: