రానా దగ్గుపాటి కెరీర్ ని ఒకసారి చూసుకుంటే ఆయన చేసిన సినిమాలు ఒక్కక్కటి దేనికి దానికి కొత్తగా ఉంటుంది. హీరోగానే ఉండకుండా పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాల్లోనేనా రానా నటిస్తూ వస్తున్నారు. బాహుబలి లో విలన్ గా సంచలనం సృష్టించిన రానా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో డానియల్ శేఖర్ గా మనల్ని అలరించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాని నాగ చైతన్య కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే హిందీలో ఆయన అమీర్ ఖాన్ తో కలిసి  లాల్ సింగ్ చద్దా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 ఈ సినిమాలో నాగ చైతన్య నటన కి మెచ్చి అమీర్ ఖాన్ లవ్ స్టొరీ ప్రి రిలీస్ ఫంక్షన్ కి వచ్చి అందరిని మెచ్చుకున్నాడు. లాల్ సింగ్ చద్దా లో నాగ చైతన్య ని చాలా మంచి రోల్. అయితే ఇప్పుడు నాగ చైతన్య రానా లాగా విలన్ గా కూడా మారబోతున్నారు. అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఒక భారీ రేంజ్ వెబ్ సిరీస్ లో నాగ చైతన్య నెగటివ్ పాత్రలో నటించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయం నాగ చైతన్య లవ్ స్టొరీ సినిమా ప్రమోషన్స్ లో తెలిపాడు. ఇక ఆయన నటిస్తున్న లవ్ స్టొరీ 24 న ఘనంగా విడుదల కాబోతుంది.

 ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ కె కుమార్ తో థాంక్ యు సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆయనకి జోడిగా రాశి ఖన్నా నటిస్తుండగా ఇంకొక  కొత్త హీరోయిన్ కూడా కలిసి నటిస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా పూర్తి అయిన వెంటనే నాగ చైతన్య వెబ్ సిరీస్ ని మొదలుపెట్టబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: