దాదాపు అన్ని భాషలలో నటించి ప్రేక్షకుల వద్ద మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా. లీడర్ సినిమా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన చిన్న పాత్ర అయినా సరే ఇతర భాషలలో కొన్ని సినిమాలలో నటించి అక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అదే ఇప్పుడు ఆయనకు మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. హిందీ లో కొన్ని పాత్రలు చేసిన రానా బాహుబలి సినిమా తో ఒక్కసారిగా దేశం మొత్తం కనిపించి స్టార్ నటుడి గా ఎదిగాడు. ప్రస్తుతం సోలో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు రానా.

ఈ క్రమంలోనే ఆయన మంచి మంచి సినిమాలు చేసి హిట్ లు సంపాదిస్తున్నాడు. తాజాగా విరాటపర్వం అనే సినిమాలో సోలో హీరోగా నటించి మరో హిట్ సంపాదించుకునే దిశగా దూసుకు వెళుతున్నాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా ప్రతినాయకుడిగా కనిపిస్తున్నాడు. డానియల్ శేఖర్ అనే పాత్రలో నటించిన రానా పాత్రకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదల కాగా యూట్యూబ్ లో అది ట్రెండ్ గా నిలిచింది. ఏదేమైనా దగ్గుబాటి రానా ముందుచూపుతో ఇతర భాషలలో చిన్న పాత్ర అయినా సరే నటించి ఇప్పుడు ఆ భాషలో స్టార్ గా కొనసాగుతున్నాడు. 

అయితే రానా ను ఇన్స్పైర్ గా తీసుకున్న కొంతమంది టాలీవుడ్ యంగ్ హీరోలు ఇతర భాషల సినిమా లలో నటించడం మొదలుపెట్టారు. కార్తికేయ నాగచైతన్య వంటి వారు బాలీవుడ్ లో కోలీవుడ్ సినిమా లలో చిన్న పాత్ర అయినా సరే నటించి అక్కడ ఇమేజ్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరు కూడా రానా లా సక్సెస్ అవుతారా అనేది చూడాలి. టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు చేసే వారి సంఖ్య ఎక్కువ అవుతుండటంతో మన హీరోలు ఈ విధంగా ఆలోచించడం మొదలు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: