సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్ లో సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. హారర్ సినిమా గా వచ్చిన ఈ సినిమా సరికొత్త కథ కథనాలతో తెరకెక్కి మంచి ఎక్స్ పీరియన్స్ అందించింది ప్రేక్షకులకు. హర్రర్ చిత్రం అనగానే అందరూ భయపెట్టడం, థ్రిల్ చేయడం వంటివి అనుకుంటారు. కానీ ఇది హారర్ చిత్రాల్లో సరికొత్త కథతో విభిన్నమైన టేకింగ్ తో తెరకెక్కిన చిత్రం అని చెప్పవచ్చు.  అంతేకాకుండా సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరో ఓ హారర్ సినిమా ఒప్పుకోవడం ఏంటి అని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.

కానీ ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇది రజనీ చేయవలసిన సినిమానే అని అనుకున్నారు. రజనీకాంత్ స్టైల్ ను ఆవిష్కరిస్తూ ఆయనకు తగ్గగా కథగా దీన్ని దర్శకుడు పి వాసు రూపొందించి మంచి సూపర్ హిట్ గా దీన్ని మలిచాడు. రజనీకాంత్ స్టైల్ ను చూసి తరించి పోవాలనుకున్న ఉన్న ప్రతి ఒక్క అభిమాని ఈ సినిమా చూసి ఆయనను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. నయనతార హీరోయిన్ గా జ్యోతిక ప్రధాన పాత్రలో ఈ సినిమాలో నటించగా ఈ చిత్రం అప్పట్లో రికార్డులను కొల్లగొట్టాయి. 

అయితే తాజాగా చంద్రముఖి చిత్రానికి సీక్వెల్ చంద్రముఖి 2 సినిమా వస్తూ ఉండగా ఇందులో రజనీకాంత్ నటించకపోవడం ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అన్న అనుమానాలకు దారితీస్తుంది. లారెన్స్ హీరోగా అరుంధతి అనుష్క ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా వీరిద్దరూ భారీ హార్రర్ చిత్రాలకు పెట్టింది పేరు గా ఉన్నారు. ఈ నేపథ్యంలో లో ఈ సరికొత్త కాంబో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా చంద్రముఖి రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: