సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. లేదంటే వారు ఎంతగా ప్రయత్నించినా కూడా స్టార్ లు అవడం కాదు కదా కనీసం అవకాశాలు కూడా దక్కించుకోలేరు. ఆ విధంగా హీరో హీరోయిన్లు తమ కష్టంతో అదృష్టం తో పోటీపడి మరి మంచి మంచి సినిమా అవకాశాలను పొంది వారు ఇప్పుడు ఈ స్థానానికి చేరుకున్నారు. అయితే కొంతమంది హీరోయిన్లు మాత్రం వచ్చిన దారిని మర్చిపోయి ఇప్పుడు ఇండస్ట్రీలో బిల్డప్ ఇవ్వడం వారి పతనానికి దారి తీస్తుంది.

ఆ విధంగా కొంతమంది హీరోయిన్ లు సినిమా పట్ల శ్రద్ధ లేకుండా బాధ్యతారాహిత్యంగా నడుచుకుంటూ సినిమా ఖర్చు పెరిగి పోవడానికి ముఖ్య కారణం అవుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా హీరోయిన్ లలోనే ఉండటం గమనార్హం. ఇటీవలి కాలంలో టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ తో విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. ఎప్పుడు కూల్ గా ఉంటూ స్మైల్ తో ఆకట్టుకునే ప్రభాస్ కే కోపం వచ్చిందంటే పూజా హెగ్డే ఎంత బాధ్యతారాహిత్యంగా నడుచుకుందో అర్థం చేసుకోవచ్చు.

షూటింగ్ కు ఆలస్యంగా రావడం వచ్చినా కూడా తొందరగా రెడీ కాకపోవడం, రెడీ అయిన కూడా షాట్ కు సరిగా స్పందించక పోవడం వంటివి ఆమెపై ప్రభాస్ కు కోపం రావడానికి కారణాలు అని సోషల్ మీడియాలో వార్తలు రాగా ఇందులో నిజం లేదని రాధే శ్యామ్ టీమ్ కూడా స్పష్టత ఇచ్చింది. అయితే ఇలాంటి వాదనలు వినడం ఇండస్ట్రీ లో కొత్తేమీ కాదు.  ఎందుకంటే గతంలో చాలా మంది హీరోయిన్లు తమ స్టార్ స్టేటస్ వచ్చాక నిర్మాతలతో హీరోలతో విభేదాలు ఏర్పరుచుకుని తమ కెరీర్ ను నాశనం చేసుకున్నారు. అయితే ఇప్పటి తరం హీరోయిన్ లు అందుకు ఏ మాత్రం తక్కువ తినలేదు. పూజా హెగ్డే కాకున్నా మరి కొంత మంది హీరోయిన్లు మాత్రం నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ సినిమా పట్ల అజాగ్రత్తగా ఉంటున్నారట. మరి వారు ఎలా నిలదొక్కుకొని మళ్లీ సినిమాలు చేస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: