టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన హీరో గా వెంకటేష్ అందరి హీరోల కన్నా ముందు ఉంటాడు. ఆయన తన కెరీర్ మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఇప్పటి వరకు దాదాపు 20 సినిమాలకు పైగా రీమేక్ చేశాడు. ఆ విధంగా టాలీవుడ్ లో ఏ హీరో కూడా అన్ని రీమేక్ సినిమాలో  చేయలేదు. మొదటి నుంచి వెంకటేష్ కు రీమేక్ సినిమాలంటే ఎంతో ఇష్టం. అవి హిట్ సాధించిన సాధించకపోయినా రీమేక్ సినిమా అంటే ముందుంటాడు. అలా ఇప్పటివరకు ఎన్నో రీమేక్ సినిమాలు చేసి హిట్లు సంపాదించగా తాజాగా వచ్చిన నారప్ప అనే సినిమా కూడా రీమేక్ సినిమాగానే చేసి హిట్ కొట్టాడు.

ఈ నేపథ్యంలోనే ఆయన మరొక రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మలయాళంలో హిట్ అయిన దృశ్యం 2 సినిమా ను తెలుగులో ఇప్పటికే రీమేక్ చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు. దసరా కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచన చేస్తుంది చిత్రబృందం. ఇకపోతే తాజాగా ఆయన ఓ వెబ్ సీరిస్ ఓకే చేసిన విషయం తెలిసిందే. రానా మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ కి రానా నాయుడు అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసి అధికారిక ప్రకటన ఇచ్చారు. దీనిపై వెంకటేష్ మరియు రానా లు కూడా స్పందించారు. అయితే ఈ సిరీస్ కూడా అమెరికా కు చెందిన సిరీస్ కి రీమేక్ అని తెలుస్తుంది.

సినిమాల పరంగా రీమేక్ చిత్రాలు చేస్తున్న వెంకటేష్ వెబ్ సిరీస్ లోనూ ఈ రీమేక్ మంత్రాన్ని జపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ముందుకు వెళుతున్నారు. మరి భవిష్యత్తులో ఆయన ఇంకా ఎన్ని రీమేక్ చిత్రాలు చేస్తారో చూడాలి. ఆయన హీరోగా ప్రస్తుతం f3 సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో మరో కథానాయకుడిగా వరుణ్ తేజ్ నటిస్తూ ఉండగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్నా మరియు మెహ్రీన్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి వెంకీ, రానా లు నటిస్తున్న ఈ అమెరికన్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: