దియా అనేది ఒక కన్నడ సినిమా సినిమా అయినప్పటికీ తెలుగు ఈ సినిమాకి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది . ఈ సినిమా క్లైమాక్స్ ని మనం చాలా సార్లు వాట్సాప్ స్టేటస్ లో చూసే ఉంటాం. చివరి సంవత్సరం విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. సినిమాలో ఒక్క పాట కూడా లేకుండా సినిమాను ఎక్కడ బోర్ కొట్టకుండా తీసాడు డైరెక్టర్. అయితే ఈ సినిమా గాని మీరు చూసి ఉంటే సినిమాలో హీరోయిన్ ఖుషి మీకు గుర్తుండే ఉంటది.

ఆమె యాక్టింగ్ ఈ సినిమాకే హైలెట్. తన నటనతో సినిమా అంతా నడిపింది. అయితే ఈ సినిమా వల్ల తనకి కన్నాడలోనే కాదు తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇప్పటికే కన్నడలో రెండు మూడు సినిమాల్లో నటించబోతున్న తను ఇప్పుడు తెలుగు మీద కూడా కన్నేసింది.ఆమె తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ఈ మద్యనే పూజ కార్యక్రమం జరుగుకుంది. సుందిప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పూజ కి అల్లరి నరేష్, నాగ శౌర్య అతిథులుగా వచ్చారు.

అయితే ఖుషి కి తెలుగులో వరసగా ఆఫర్స్ వస్తున్నాయి అని టాక్. ఆమె సినిమా దియా ఈ మద్యనే యూట్యూబ్ డబ్బింగ్ వెర్షన్ విడుదలై మంచి వ్యూస్ తెచ్చుకుంది. అలాగే ఆ సినిమా రీమేక్ గా వచ్చిన డియర్ మేఘా మాత్రం కలెక్షన్స్ పెద్దగా లేక ప్లాప్ గా నిలిచింది. ఇక ఖుషి విషయానికి వస్తే ఆమె ఇంతకముందు తెలుగులో రాహుల్ రవీంద్ర హీరోగా వచ్చిన  అలా ఎలా అనే కామెడీ సినిమాలో నటించింది.  ఈ సినిమా కూడా బాగానే ఆడింది కానీ పెద్దగా తెలుగులో అవకాశాలు లేక కన్నడ కి వెళ్లిన ఖుషి కి అక్కడ మంచి అవకాశాలు దొరికాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: