బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించిన నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ "ఆది" సినిమాతో సాలిడ్ హిట్ ను అందుకున్నాడు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకుని తారక్ కెరియర్ కి అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చింది. హిట్ ఫ్లాప్ లని తేడా లేకుండా అదిరిపోయే నటనతో, సరికొత్త డాన్స్ స్టెప్పులతో తన ఇమేజ్ ను పెంచుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్ ఉండటం సహజం. ఓ సారి సినిమా పెద్ద హిట్ అయితే అదే దర్శకుడితో , అదే హీరోయిన్ తో మళ్ళీ మళ్ళీ సినిమాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు స్టార్ హీరోలు. అంతేకాక స్టార్ డైరెక్టర్ లతో సినిమాలు చేస్తేనే వారి క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని నమ్ముతుంటారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా మొదట్లో హిట్ డైరెక్టర్ లతో వరుస చిత్రాలు చేశాడు. కానీ వారంతా తారక్ నమ్మకాన్ని తారుమారు చేశారు, ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు. అలా వచ్చిన చిత్రాలే దమ్ము, ఊసరవెల్లి, రభస చిత్రాలు.

దాంతో హిట్ దర్శకుడితో తారక్ మూవీ చేస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్ కూడా ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో వినిపించింది. "సింహ" వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత దర్శకుడు బోయపాటి ఎన్టీఆర్ తో దమ్ము సినిమా చేయగా అది కాస్త ఫ్లాప్ అయ్యింది. కిక్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇండస్ట్రీకి అందించిన సురేందర్ రెడ్డితో "ఊసరవెల్లి" సినిమా తీస్తే అది కూడా ఎన్టీఆర్ కెరియర్ లో డిజాస్టర్ గా మారింది. "కందిరీగ" సూపర్ హిట్ అనంతరం సంతోష్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ "రభస" చేయగా అది ఫ్లాప్  అయ్యింది. ఇక్కడ ముఖ్యంగా "ఊసరవెల్లి" సినిమా విషయానికొస్తే...ఈ సినిమా పై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. ఇండస్ట్రీకి  "కిక్" ఇచ్చిన సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ కి హిట్ ఇవ్వడం గ్యారంటీ అని, తారక్ తన గ్రేస్ చూపిస్తారని అంతా అనుకున్నారు కానీ...బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా తేలిపోయింది.

సినిమా బాగుందని ఫీల్ ఉన్నా వసూళ్లను రాబట్టడంలో ఈ చిత్రం ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. తమన్నా లాంటి క్రేజీ హీరోయిన్ చిత్రంలో ఉన్న సినిమాకి ప్లస్ కాలేకపోయారు. గతంలో ఎన్టీఆర్ తో వక్కంతం వంశీ, సురేందర్‌రెడ్డి ఇద్దరూ కలిసి అశోక్ అనే సినిమా తీసి తారక్ కెరీర్‌లో ఫ్లాప్‌ ఇచ్చారు. ఎలాగైనా తారక్ కి మళ్ళీ ఒక హిట్‌ ఇవ్వాలి అనుకుని ఊసరవెల్లి సినిమా తీయగా అది కూడా నిరాశనే మిగిల్చింది. 16 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1,800 స్క్రీన్లలో అక్టోబర్ 6 2011 లో రిలీజ్ అయ్యింది. ఆశించిన కలెక్షన్లను రాబట్టడంలో ఈ సినిమా సత్తా చాటలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: