ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడు లోనూ బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖుల బ‌యోపిక్ లు థియేట‌ర్స్ ల‌లో క‌నిపించాయి. ఇందులో ఆట‌గాళ్ల  బ‌యోపిక్ లు కూడా ఉన్నాయి. ఇప్ప‌టికే టీమిండియా మాజీ సార‌థి మ‌హేంద్ర సింగ్ ధోని బ‌యోపిక్, అలాగే గాడ్ ఆఫ్ ద క్రికెట్ స‌చిన్ టెండుల్క‌ర్‌, క‌పిల్ దేవ్ వంటి క్రికెట్ ఆట‌గాళ్ల పై బ‌యోపిక్ లు వ‌చ్చాయి. దాదాపు అన్ని కూడా మంచి హిట్ టాక్ ను  సొంతం చేసుకున్నాయి. మహేంద్ర సింగ్ ధోని బ‌యోపిక్ ద అన్ టోల్డ్ స్టోరీ అయితే తెలుగు తో పాటు చాలా భాషాల లోనూ వ‌చ్చింది. అలాగే మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండుల్క‌ర్ బ‌యోపిక్ ఎ బిలియ‌న్ డ్రిమ్స్ కూడా మంచి హిట్ అందుకుంది.




ఇదీలా ఉండ‌గా క్రికెటర్ల‌తో పాటు ఇత‌ర క్రీడాల ఆట‌గాళ్ల బ‌యోపిక్ లు రావ‌డానికి సిద్ధం గా ఉన్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ముఖ బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ సంబంధించిన వార్తలు కూడా వ‌చ్చాయి. ఈ సినిమా టైటీల్ రోల్ ను హిరో సిధీర్ బాబు పోషిస్తున్నాడ‌ని తెలుస్తుంది. తాజా గా మ‌రో బ్యాడ్మీంట‌న్ స్టార్ ప్లేయ‌ర్ బ‌యోపిక్ వ‌స్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అదే రెండు ఒలంపిక్స్ లో మెడ‌ల్ సాధించిన పీ వీ సింధు బ‌యోపిక్ అని పుకార్లు వ‌స్తున్నాయి. ఈ సినిమాకు టైటిల్ రోల్ గా స్టార్ హిరోయిన్ దీపికా ప‌దుకొన్ న‌టిస్తోంద‌న్న వార్తలు వస్తున్నాయి. ఈ పుకార్ల‌కు బ‌లం చేకురేలా పీవీ సింధు.. దీపికా ఇంటి కి వెళ్లి క‌లిసింది. అలాగే తాజా గా దీపికా ప‌దుకొన్ తో బ్యాట్ ప‌ట్టి బ్యాడ్మింట‌న్ ఆడింది. ఆ పోటో ల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంది.




ఈ ఫోటో ల‌ను చూసిన అభిమానులు త్వ‌ర‌లో పీవీ సింధు బ‌యోపిక్ వ‌స్తుంద‌ని జోస్యం చెబుతున్నారు. ఈ బ‌యోపిక్ లో దీపికా ప‌దుకొన్ టైటిల్ రోల్ చేస్తుంది అని అంటున్నారు. అందు కోసమే దీపికా బ్యాడ్మింట‌న్ ఆడుతుంద‌ని అంటున్నారు. కాగ దీపికా ప‌దుకొన్ గ‌తం లో కూడా బ‌యోపిక్ లు చేసింది. ల‌క్ష్మి అగ‌ర్వాల్ అనే యాసిడ్ దాడి బాధితురాలి బ‌యోపిక్ లో దీపికా ప‌దుకొన్ న‌టించింది. ఈ బ‌యోపిక్ కు చాప‌క్ అనే టైటిల్ పెట్టారు. ఈ బ‌యోపిక్ లో దీపికా న‌ట‌న చాలా బాగుంద‌ని విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంశ‌లు కురుపించారు. అయితే ఇప్పుడు పీవీ సింధు బ‌యోపిక్ వ‌స్తుందా.. వ‌స్తే దీపికా నే టైటిల్ రోల్ పోషిస్తుందా అనేది అధికార ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాలి.





మరింత సమాచారం తెలుసుకోండి: