టాలీవుడ్ లో ఎందరో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు, ఇంకా చేస్తున్నారు కూడా. అయితే కొన్ని రికార్డులు కొందరికే సొంతం అని కూడా చెప్పాలి. అలాంటి అరుదైన రికార్డుకు చేరువలో నట సింహం నందమూరి బాలక్రిష్ణ ఉన్నారు.


ఆయన ఈ రోజుకీ నాటౌట్ అంటున్నారు. తన నటనతో ఇంకా అనేక విభిన్నమైన పాత్రలను ఆడియన్స్ ముందు పెడుతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాలయ్య నట జీవిత ప్రస్థానంలో అరుదైన ఘట్టానికి చేరువలో ఉన్నారని చెప్పాలి. అదేలా అంటే బాలయ్య 1974లో తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా తెలుగు సినిమా అప్రిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ మూవీ తాతమ్మ కల. ఆ మూవీ తరువాత ఈ రోజు వరకూ బాలయ్య నటిస్తూనే ఉన్నారు. ఆయన ఎక్కడా అలసిపోలేదు. ఆ విధంగా గ్యాప్ లేకుండా నటించే హీరోలలో బాలయ్య టాలీవుడ్ లో రేర్ అని చెప్పాలి.


ఆయన ఈ విధంగా సరికొత్త రికార్డునే సృష్టిస్తున్నారు. మరో మూడేళ్ళలో అంటే 2024 నాటికి బాలయ్య టాలీవుడ్ లో నటుడిగా యాభై వసంతాల పండుగను జరుపుకోబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో స్టార్లు ఉన్నారు. కానీ వారంతా ఈ రికార్డుని బ్రేక్ చేయలేరనే చెప్పాలి. కొందరు హీరోలు నాలుగున్నర దశాబ్దాల పాటు నటించినా మధ్యలో చాలా ఏళ్ళ పాటు  విరామం ఇచ్చారు. మరికొందరు నటించాలనుకున్నా ఎందుకో అనేక కారణాల వల్ల తెర వెనక్కి వెళ్లారు. మరి అలా కనుక చూసుకుంటే బాలయ్య సుదీర్ఘంగా కెరీర్ కొనసాగించిన హీరోగా స్వర్ణోత్సవ వేడుకను జరుపుకుంటారని అనుకోవాలి. అది నందమూరి ఫ్యాన్స్ కి కూడా కన్నుల పండుగగా కూడా చెప్పాలి.  మొత్తానికి  మరో మూడేళ్ళలో అర్ధ సెంచరీ ఇయర్ దాటి బాలయ్య నటన ముందుకు సాగుతుంది.  మరో వైపు చూస్తే బాలయ్య మరిన్ని ఏళ్ల పాటు నటించేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కడా ఆయన ఎనర్జీ తగ్గడంలేదు. దాంతో బాలయ్య సునాయాసంగా ఆరు దశాబ్దాల పండుగను కూడా జరుపుకుంటారనుకోవచ్చేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: