పాటలంటే ప్రాణంగా బతికేవారు చాలామందే ఉంటారు. తమ రోజువారి జీవితంలో సంగీతంతో సగభాగం గడిపేవారున్నారు. అలాంటి వారికి ఆశాజ్యోతిగా మారాడు రామ్ మిరియాల. మాస్‌కి కనెక్ట్ అయితే చాలు కెరీర్‌ బెస్ట్ ఫేజ్‌కి వెళ్తుందంటారు. ఫుల్‌ అలాంటి వారు చాలా బిజీగా గడుపుతారు. రామ్‌ మిరియాల కూడా ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఫోక్ స్టైల్‌ వాయిస్‌తో మ్యూజిక్‌ లవర్స్‌ని ఆకట్టుకుంటన్నాడు. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాడు.  

విభిన్నమైన సంగీతంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ మిరియాల, ప్లే బ్యాక్ సింగింగ్‌లో కూడా అంతే పాపులర్‌ అవుతున్నాడు. ఫోక్‌ స్టైల్‌ సాంగ్స్‌తో మ్యూజిక్ లవర్స్‌కి దగ్గరవుతున్నాడు. ముఖ్యంగా చిన్న సినిమాలకి స్టార్‌ ప్రమోటర్‌లా మారుతున్నాడు. 'మంచిరోజులొచ్చాయి' సినిమాలో రామ్ మిరియాల పాడిన ఎక్కేసిందే సాంగ్‌ ప్రోమోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.

యూత్‌ని ఈ మధ్యకాలంలో ప్రేమ స్టెప్పులేయించిన పాట 'జాతి రత్నాలు' 'చిట్టి' సాంగ్. నవీన్‌ పోలిశెట్టి కామెడీ టైమింగ్‌కి సెట్‌ అయ్యేలా రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటని రామ్‌ మిరియాల పాడాడు. అలాగే ఆనంద్‌ దేవరకొండ 'పుష్పక విమానం'లో 'సిలకా' అనే ‌పాటకి లిరిక్స్, కంపోజింగ్‌ వోకల్స్‌ అన్నీ రామ్ మిరియాలే ఇచ్చాడు.

చిన్న సినిమాలతో పాటు టాప్ హీరోలకి కూడా పాడుతున్నాడు రామ్‌ మిరియాల. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ 'భీమ్లానాయక్' టైటిల్‌ సాంగ్‌ని తమన్, శ్రీ కృష్ణ, పృధ్వీచంద్రతో కలిసి పాడాడు. ఇక కిన్నెర మొగిలయ్య గానంతో మొదలైన ఈ పాటకి మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మొత్తానికి రామ్ మిరియాల తెలుగు నాట స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ.. మంచి సింగర్ గానే పేరొందుతున్నాడు.  ముందు ముందు ఈ కళాకారుడు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి. సంగీత ప్రేమికులు మాత్రం రామ్ మిరియాల నోట నుండి వచ్చే పాటల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: