శోభన్ బాబు అలనాటి నటుడు, టాలీవుడ్ లో ఒకనాడు అందాల నటుడు అన్న పేరు ఆయనకే సొంతం. అటువంటి శోభన్ కి లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. శోభన్ కేవలం క్లాస్ మూవీస్ కే పరిమితం కాకుండా పక్కా మాస్ మూవీస్ చేసి మెప్పించారు.

శోభన్ బాబు కెరీర్ లో 70 దశకం స్వర్ణయుగం అని చెప్పాలి. నాడు తోటి అగ్ర హీరోలను మించి హిట్లను ఆయన సొంతం చేసుకున్నారు. అలాగే వరసగా అవార్డులను కూడా అందుకున్నారు. శోభన్ బాబు ఎనభై దశకం మధ్య దాకా మంచి పీక్స్ లో ఉండేవారు. అయితే ఆ టైమ్ లో వచ్చిన చిరంజీవి, బాలయ్య వంటి యువ హీరోల తాకిడితో ఆయన కొంత వెనకబడ్డారు. ఇక శోభన్ బాబుకు డిమాండ్ మాత్రం బాగానే ఉండేది.

ఆయనను నటింపచేయాలని ఎందరో నిర్మాతలు ట్రై చేసేవారు. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు లాంటి వారు అయితే ఆయన్ని మళ్ళీ వెండి తెర మీద కనిపించేలా చేయాలనుకున్నారు. అయితే నిర్మాతలు బ్లాంక్ చెక్స్ ఇచ్చినా తనకు బంపర్ ఆఫర్లు ఇచ్చినా కూడా శోభన్ బాబు మాత్రం తన నిర్ణయాన్ని అసలు మార్చుకోలేదు. తాను నటనకు దూరం అని తెగేసి చెప్పేసేవారు. ఆ విషయంలో ఆయన ఎంత చనువు  ఉన్న వారికైనా మొహమాటం లేకుండా నో అనేసేవారు.

దీని మీద ప్రముఖ దర్శకుడు ఏ కోదండరామిరెడ్డి కూడా శోభన్ బాబుని అడిగారుట. నటించడం మానవద్దు. మీరు సరేనంటే ఎన్నో పాత్రలు రెడీగా ఉన్నాయని చెప్పారుట. అయితే దానికి శోభన్ బాబు ఇచ్చిన జవాబు మాత్రం ఆయన ఫ్యాన్స్ నే కాదు అందరికీ షాక్ తినిపించేలా చేస్తుంది. తన వయసు పెరిగిందని, అందాల నటుడిగా తాను తెర మీద ఎప్పటికీ కనిపించలేనని శోభన్ బాబు చాలా  బాధపడ్డారుట. తన శరీరంలో వచ్చిన మార్పులతో తాను నటనకు శాశ్వతంగా దూరంగా ఉండడమే బెటర్ అని ఆయన చెప్పినపుడు కోదండరామి రెడ్డి కూడా బాధ పడ్డారుట. మొత్తానికి అందాల నటుడిగా తనను అభిమానించిన ప్రేక్షకులకు అలాగే తాను చిరకాలం గుర్తిండిపోవాలనే శోభన్ నటనకు దూరం అయ్యారని అంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: