దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా దేశంలో కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఆ మధ్య ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 13 వ తేదీన థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. కాకపోతే ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13 న తేదీన విడుదల అయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు అని కూడా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి.

 మరియు సినిమాను అక్టోబర్ లో విడుదల చేయకపోవడానికి  ప్రధాన కారణం ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో కరోనా ఆంక్షలు విధించి ఉండటం, మరియు అలాగే కొన్ని రాష్ట్రాలలో థియేటర్ లు ఇంకా ఓపెన్ చేయకపోవడం, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ఈ సినిమాను అన్ని రాష్ట్రాలలో పరిస్థితులు చక్కబడిన తర్వాతనే  విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' సినిమాను దసరాకు విడుదల చేయడం కుదరక పోయినట్లయితే సంక్రాంతి కి లేదా సమ్మర్ లో ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ సినిమాను సంక్రాంతికి కనుక విడుదల చేసినట్లు అయితే తమిళ 'వాలిమై' చిత్రంతో 'ఆర్ఆర్ఆర్'  సినిమా తమిళ బాక్స్ ఆఫీసు వద్ద పోటీపడవలసి వస్తుంది. ఒక వేళ ఈ సినిమాను సమ్మర్ లో కనుక 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని విడుదల చేసినట్లు అయితే తమిళ సూపర్ స్టార్ విజయ్ 'బీస్ట్' మూవీ తో తమిళ బాక్సాఫీస్ వద్ద తలపడవలసి వస్తుంది. మరి 'ఆర్ఆర్ఆర్' సినిమాను దసరాకి విడుదల చేస్తారో అలా కాదు అని సంక్రాంతి లేదా సమ్మర్ లో విడుదల చేస్తారా.. అనేది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: