సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీను వైట్ల మొత్తం రెండు సినిమాలు తీశారు, కాగా వాటిలో మొదట ఆయన తీసిన సినిమా దూకుడు. సమంత అక్కినేని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందించగా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇన్స్పెక్టర్ అజయ్ గా కనిపించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, వెన్నెల కిషోర్, సోనియా, షాయాజీ షిండే, కోట శ్రీనివాస రావు తదితరులు ఇతర పాత్రలు చేయగా సోను సూద్ విలన్ గా కనిపించారు.
కొన్నేళ్ల క్రితం విలన్స్ పన్నిన పన్నాగంతో ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన తన తండ్రిని బ్రతికించుకోవడం కోసం ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, ఎమ్మెల్యే అజయ్ గా నటిస్తూ, ఆపైన తన తండ్రిని చంపడానికి ప్రయత్నించిన వారిని ఏ విధంగా తెలివిగా మట్టుబెడతాడు అనే కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. ఆ విధంగా మంచి యాక్షన్ తో కూడిన పక్కా కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ని కూడా ఆకట్టుకునేలా ఎంతో అద్భుతంగా తీశారు. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ అద్భుత నటన, సమంత అందం, యాక్టింగ్, భారీ యక్షన్ సీన్స్ తో పాటు అలరించే కామెడీ సన్నివేశాలు, మరీ ముఖ్యంగా థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ వంటివి సినిమా సూపర్ సక్సెస్ లో ప్రధాన భూమిక పోషించాయి.
అయితే అసలు విషయం ఏమిటంటే ఈ భారీ ప్రతిష్టాత్మక సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన ప్రాంతాల్లో సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కోసం థియేటర్స్ లో స్పెషల్ షో లు ప్రదర్శిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే ఈ స్పెషల్ షో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతుండగా మహేష్ ఫ్యాన్స్ ఎంతైనా ఇచ్చి వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో దూకుడు 10 ఏళ్ళ సంబరాలను కేక్ కటింగ్స్ తో ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ అభిమానులు. మొత్తంగా సినిమా వచ్చి పదేళ్లు పూర్తయినప్పటికీ కూడా దూకుడు మూవీ ఇంకా దూకుడు చూపిస్తూనే ఉందని చెప్పకతప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: