టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బాగా బ్యాడ్ లక్ ఉన్న హీరో ఎవరు అంటే నాని అనే చెప్పాలి. ఆయన హీరోగా నటించిన గత రెండు చిత్రాలు ఓ టీ టీ కే పరిమితమైపోవడం ఆయన క్రేజ్ ను మరింతగా తగ్గిస్తుంది. అండర్ రేటెడ్ హీరోగా పలు విజయాలు సాధించి ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ హీరో  దక్కించుకొని క్రేజ్ ను అందుకుని స్టార్ హీరోగా ఎదుగుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన మోహన కృష్ణ దర్శకత్వంలో చేసిన వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై ప్రేక్షకుల ను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

దాంతో తన తదుపరి సినిమా టక్ జగదీష్ తో అయినా అభిమానులను ప్రేక్షకులను ఆనందింప చేయాలని నాని ప్రయత్నాలు చేయగా అది కూడా వర్కవుట్ కాలేకపోయింది. ఈ సినిమా కూడా కరోనా ప్రభావం వలన అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేయాల్సి వచ్చింది.  అయితే ఈ సినిమా ప్రైమ్ లో  విడుదలైన తొలి రోజు నుంచే బ్యాడ్ టాక్ ను తెచ్చుకోవడం ప్రారంభించింది. దీంతో నాని ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఈ రెండు సినిమాలు భారీ ఫ్లాప్ గా నిలిచాయి. దానికి తోడు సినిమా పరిశ్రమలోని థియేటర్ యాజమాన్యలు నాని పై నిప్పుల వర్షం కురిపించాయి. ఆయనను విమర్శలతో ముంచెత్తాయి.

అయితే ఈ రెండు సినిమాలు ఓ టీ టీ  లో కాకుండా ధియేటర్లలో విడుదల అయితే ఏదోకరకంగా నాని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఆ సినిమాలను హిట్ చేసుకునే వాడే.. కానీ ఈ సినిమా ఓ టి టి లో రావడం వల్లే భారీ ఫ్లాప్ అయ్యాయని సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఆయన తాజాగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా కూడా ఓ టీ టీ లోనే విడుదల అవుతున్నట్లు తెలుస్తుంది.  త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది. దసరా కి లేదా దీపావళి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాని నటించిన మూడు చిత్రాలు ఓ టీ టీ లోనే విడుదలైతే ఆయన ఇమేజ్ కి ప్రమాదం ఏర్పడినట్లే. 

మరింత సమాచారం తెలుసుకోండి: