సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు చేశారు. అంతేకాదు ఎక్కువగా ఫ్లాప్ సినిమాలను కూడా చేశారు. అయితే కొన్ని సార్లు హిట్ సినిమాలను వదిలేసుకుని మరి ఆయన ఫ్లాప్ చిత్రాలు చేయడం ఆయన అభిమానులు ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన చిత్రం దూకుడు సినిమా తర్వాత పక్కాగా సూపర్ హిట్ అయ్యే చిత్రానికి నో చెప్పి అదే శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎంతో అపారమైన నమ్మకం తో మహేష్ ఆగడు సినిమా చేయగా ఈ సినిమా ఫ్లాప్ అవడాన్ని ఎవరూ ఆపలేకపోయారు.

ఫలితంగా మహేష్ బాబు కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాప్ సినిమాగా ఆగడు నిలవగా ఆయన మిస్ అయిన చిత్రం మామూలు దర్శకుడితో మామూలు సినిమా కాదు. అదే శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహితుడు సినిమా. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన త్రీ ఇడియట్స్ చిత్రాన్ని తెలుగు తమిళ భాషలలో రీమేక్ చేయాలని శంకర్ భావించగా అందుకు ప్రయత్నాలు జరుగుతున్న రోజులలో అమీర్ ఖాన్ నటించిన పాత్రకు ముందుగా మహేష్ బాబు ను అనుకున్నారు. వెంటనే అతన్ని సంప్రదించారు.అయితే అప్పటికే దూకుడు కాంబినేషన్ సెట్ అవుతుంది అని చెప్పి ఈ సినిమాను పక్కన పెట్టాడు మహేష్.

దూకుడు సినిమా బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఈసారి కూడా అలాంటి సినిమానే తెరకెక్కిస్తారని భావించాడు కానీ ఆగడు సినిమా ఇటు దర్శకుడుకి, అటు హీరో కి ఇద్దరికీ భారీ ఫ్లాప్ ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత శంకర్ స్నేహితుడు సినిమా లో విజయ్ హీరోగా నటించగా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది ఈ సినిమా. ఆ తర్వాత తమిళంలో సూపర్ స్టార్ గా ఎదిగి ప్రేక్షకులను వరుస విజయాలతో ఆయన అలరిస్తూనే వస్తున్నాడు. ఈ సినిమా మహేష్ చేసి ఉంటే ఇప్పుడు ఇండియా వైడ్ గా ఆయనకు ఎక్కువ సినిమాలు చేసే ఛాన్స్ వచ్చేది. అప్పుడే తమిళంలో మార్కెట్ ఏర్పరుచుకునే అవకాశం ఉండేది. కానీ ఆగడు సినిమా చేయడం వల్ల ఎంతో పెద్ద ఆపర్చునిటీ మహేష్ మిస్ అయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: