స్వరం రాగం సమ్మిళిత జీవితంలో.. ఏడాది దాటి పోయింది. ఏడాది వెళ్లి పోయింది. వెళ్లిపోయిన కాలాలకు వీడ్కోలు.. వెళ్లిపోయిన స్వర సముద్రం ఏదీ లేదు. అది నిరంతరం మన మధ్య సాగించే హోరు, వినిపించే నాదం, తన్మయ గానం అజరామరం. మరణం లే ని చోటు స్వర గమన రీతికి మాత్రమే సాధ్యం. ఆ కోవలో, ఆ తోవలో కొన్ని యువ గళాల అర్చనలో శ్రీకాకుళం. ఆయన ఎంతో ప్రే మించే తూర్పు ప్రాంతం. ఆయన ప్రేమను అధికంగా పంచిన తూర్పు ప్రాంతం ఇప్పుడు ఓ బృహత్ కార్యాన్ని ఎంచుకుంది.పద్మ విభూషణ్, డాక్టర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరగనుంది. సినీ సంగీతంలో సాగించిన ప్రయాణాన్ని గు ర్తుకు చేసుకోనుంది. తెలుగు భాషకు చేసిన సేవను మరొక్కసారి కొన్ని పద నీరాజనాల మధ్య పాటల రూపంలో పలికించనుంది. సెప్టెంబర్ 25న ఈ కార్యక్రమం బాలు స్వ‌ర నీరాజ‌నం పేరిట జరగనుంది.


స్వర,రాగ ప్రవాహంలో తానొక బిందువుని అని చెప్పుకునే ఎస్పీ బాలు చనిపోయి అప్పుడే ఏడాది అయిపోయిందా! అన్న దిగ్భ్ర మ నుంచి కోలుకోలేని వారెందరో..!ఆయన పాడిన పాటల పల్లవులను పునఃశ్చరణ చేస్తూ, సంబంధిత స్వర గాన సంగతులను ప లికిస్తూ, ఉన్నతిని సాధించాలన్న తపనలో ఉన్నవారెందరో! వారంతా వర్థమాన గాయకులు. బాలూ ను నిరంతరం అనుసరిం చే శిష్యులు. ఆ..శిష్య గణం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఓ గొప్ప నివాళికి శ్రీకారం దిద్దింది.ఆ..మంచి గాయకుడు నేర్పిన కొన్ని మం చి మాటలను మరొక్కసారి స్మరించనుంది. ఆ కార్యక్రమ వివరాలివి.


గాన గంధర్వుడి ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని శ్రీకాకుళంలో ఓ ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నారు. వర్థమాన గా యనీ గాయకులంతా కలిసి ఆయనకు స్వర నీరాజనం ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన పాటల పూదోటలో విహరిం చేం దుకు, ఆయన పాడిన పాటలలో కొన్నింటిని పునఃస్మరణ చేసుకునేందుకు ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తూ.. సంబంధిత ఏ ర్పా ట్లలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని సిక్కోలు ఫ్యూచర్ సింగర్స్, మిత్రా ఫౌండేషన్ (శ్రీకాకుళం) సంయుక్తంగా స్థానిక బాపూజీ క ళామందిరంలో నిర్వ హించనుంది. సెప్టెంబర్ 25న ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, అలానే సాయంత్రం నాలు గు గంటల నుంచి ఎని మిది గంటల వరకూ జరిపేందుకు నిర్వాహకులు సన్నద్ధం అవుతున్నారు. ఔత్సాహిక కళాకారులు, గాయ నీ, గాయకులను ప్రోత్స హించాలన్న సదుద్దేశంతో ఆ మహనీయుడు చేసిన ఐదు దశాబ్దాల ప్రయాణాన్ని అవలోకిస్తూ.. సాగే ఈ కార్యక్రమాన్ని అంతా కలిసి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

ap