భావోద్వేగాలు నిండిన సినిమాలు శేఖ‌ర్ క‌మ్ముల‌వి. రెండుంటాయి..చ‌దువుకున్న అమ్మాయిల‌కు ఓ ఐడెంటిటీ ఉంటుంది. లోక రీతి తెలిసిన పెద్ద‌వాళ్ల పాత్ర‌ల‌కు ఓ తాత్వికం ఉంటుంది. ఈ రెండూ శేఖ‌ర్ కు న‌చ్చిన ప‌నులు. ఇవే చేశాడు, చేస్తాడు కూడా!



ఆనంద్ సినిమా విడుద‌ల‌య్యాక అంతా క‌మిలిని చుట్టూ తిరిగారు. ఆమె ఎవ‌రు..ఆమెను ఎలా ఎంపిక చేశారు..ఇలా ఎన్నో ప్ర‌శ్న లు మ‌దిలో మెదిలాయి. క‌మిలినీ త‌న డ‌బ్బింగ్ తాను చెప్పుకోలేదు. సునీత‌తో చెప్పించారు. సునీత వాయిస్ ఆమెకు చాలా బాగా న‌ప్ప‌డంతో ఈ సినిమాకు ఆమె చాలా ప్ల‌స్ అయ్యారు. శేఖ‌ర్ సినిమాల్లో పెద్ద పెద్ద మాట‌లేవీ ఉండ‌వు. గుర్తుపెట్టుకోవ‌చ్చు అనుకునే మాట‌లూ ఉండ‌వు కానీ ప్ర‌భావితం చేసేలా ఆయ‌న కొన్ని సంద‌ర్భాల్లో రాస్తాడు. పాత్ర తీరు ఎలా ఉంటే అదే ఆయ‌న మాట. ఇక ఆనంద్ సినిమా రూప అప్ప‌టి కుర్రకారుకు న‌చ్చేసింది. నువ్వేనా నా నువ్వేనా పాట, వ‌చ్చే వ‌చ్చే న‌ల్ల మ‌బ్బుల్లారా పాట ఈ రెండూ అప్ప‌ట్లో ఎంతంటే అంత క్రేజ్ ద‌క్కించుకున్నాయి. రూప మాత్ర‌మే అంద‌రికీ నచ్చేసింది. హీరో రాజా క‌న్నా.. ఈ సినిమా ఆ డాక్యుమెంట‌రీ స్టైల్ లోనే ఉంటుంది. ఇప్పుడు ల‌వ్ స్టోరీ అలా ఉంటుందా?



రాజ‌కీయంతో స‌మకాలీన అంశాల‌పై ఎక్కువ‌గా దృష్టి సారించే శేఖ‌ర్ ఈ సినిమాలో ఏం సాధించారు. కుల వివ‌క్ష‌ను చూపించారు అని అంటున్నారు. అది ఏ స్థాయిలో ఉండ‌నుంది అన్న‌వి చాలా ఆస‌క్తిదాయకం. ఫిదా సినిమాలో భాను మ‌తి క‌న్నా ఆనంద్ రూప క‌న్నా ల‌వ్ స్టోరీ మౌనిక ఎలా ఉంటుంది. ఎలా ఉండ‌బోతోంది. సాయి ప‌ల్ల‌వి చాలా కాన్ఫిడెంట్ గానే చెబుతుంది. ఈ సినిమా త‌న‌కు మంచి పేరు తెచ్చిపెడుతుంది అని. శేఖ‌ర్ సినిమాల్లో స్ట్రాంగ్ విమెన్ ఉంటారు. వాళ్లు అదే ప‌నిగా హీరోల చుట్టూ తిర‌గ‌రు. న‌న్ను ల‌వ్ చేయ‌వా ప్లీజ్ అని కాళ్లు ప‌ట్టుకుని బ‌తిమ‌లాడరు. ఆ క్యారెక్టర్ ఈ స‌మాజాన్ని ప్ర‌భావితం చేస్తుంది. ఏదో ఓ చోట సందేశం ఇస్తుంది. మ‌గాళ్లు అంద‌రూ అనుకునేలా ఆడాళ్లు ఉండ‌రు అనుకునేలా ఉంటుంది. ఈ సినిమా తో శేఖ‌ర్ ఎలాంటి స్త్రీ పాత్ర‌ల‌ను అందించారు అన్న‌ది చాలా కీల‌కం. శేఖ‌ర్ సినిమాల్లో విమెన్ ఐడెంటిటీ ఉంటుంది. నో మీన్స్ నో అన్న ప‌ద్ధ‌తి ఒక‌టి త‌ప్ప‌క ఉంటుంది. అవ‌న్నీ ల‌వ్ స్టోరీలో క‌నిపిస్తాయ‌ని ఆశిద్దాం. ఆల్ ద బెస్ట్ శేఖ‌ర్ ...

మరింత సమాచారం తెలుసుకోండి:

ap